క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు డ్వేన్ బ్రేవో... మైదానంలో తన ఆటతోనే కాకుండా తన నాట్యంతో, మైదానం బయట తన పాటతో కూడా అలరించే అసలు సిసలు ఆల్‌రౌండర్. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడైన అతనికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రతీ జట్టూ తమకు బ్రేవోలాంటి ఆటగాడు ఉండాలని కోరుకుంటుదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల క్రితమే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతను, బోర్డుతో గొడవల కారణంగా 2014లోనే వన్డేలకు దూరమయ్యాడు. రెండు టి20 వరల్డ్ కప్‌లు నెగ్గిన జట్టులో సభ్యుడైన బ్రేవో ఇక ఎక్కడ టి20 మ్యాచ్‌లు జరిగినా అక్కడ దర్శనమిస్తున్నాడు. తాజాగా అతను ఇంగ్లండ్ కౌంటీ మిడిలెసెక్స్ తరఫున బరిలోకి దిగాడు. దీంతో కలిపి అతను టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన జట్ల సంఖ్య సరిగ్గా 20కు చేరడం విశేషం. పది రోజుల క్రితం వరకు అతను ఆడిన జట్ల సంఖ్య 18 ఉండగా, దానికి అదనంగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. ‘ఒక్కో ఓవర్‌కు ఒక్కో టీమ్ చొప్పున నా దగ్గర వేర్వేరు 20–20 జెర్సీలు ఉన్నాయి’ అని అతను సరదాగా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 394 టి20లు ఆడిన బ్రేవో 5,685 పరుగులు చేయడంతో పాటు 430 వికెట్లు పడగొట్టాడు.
బ్రేవో ఆడిన టి20 టీమ్‌లు
1. వెస్టిండీస్, 2. ట్రినిడాడ్ అండ్ టొబాగో, 3. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, 4.ఎసెక్స్, 5. కెంట్, 6. సర్రే, 7. మిడిలెసెక్స్, 8. మెల్‌బోర్న్ రెనెగేడ్స్, 9. సిడ్నీ సిక్సర్స్, 10. విక్టోరియా, 11. చెన్నై సూపర్ కింగ్స్, 12. ముంబై ఇండియన్స్, 13. గుజరాత్ లయన్స్, 14. చిట్టగాంగ్ కింగ్స్, 15. కొమిల్లా విక్టోరియన్స్, 16. ఢాకా డైనమైట్స్, 17. లాహోర్ ఖలందర్స్, 18. పెషావర్ జల్మీ, 19. డాల్ఫిన్స్, 20. విన్నిపెగ్ హాకింగ్స్.
Comments
Please login to add a commentAdd a comment