
లాస్ ఏంజిలెస్: డ్వేన్ జాన్సన్.. అంటే స్ట్రయిక్ కావడానికి కాస్త టైమ్ పడుతుందేమో... కానీ ‘ది రాక్’ అనగానే ఓ రెజ్లర్, నటుడు టక్కున గుర్తుకొచ్చేస్తాడు. తనదైన పోరాట పటిమతో, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డ్వేన్.. తాజాగా తన మనసులోని ఓ మాటను బయటపెట్టాడు. అదేంటంటే... 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీ చేయాలనుందని చెప్పాడు. అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానన్నాడు.
‘ప్రొడ్యూసర్‌గా, నటుడిగా, వ్యాపారవేత్తగా నేను సాధించినదానితో సంతృప్తిగా ఉన్నాను. ఇక రాజకీయాల్లో కూడా నేనేంటో నిరూపించాలనుకుంటున్నా. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టినా కెరీర్‌ను వదిలిపెట్టే ప్రసక్తేలేదు. రెండింటికీ న్యాయం చేయగలననే నమ్మకం నాకుంది. అందుకు 2018లోనే తొలి అడుగు వేస్తాను. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను బరిలోకి దిగడం వందశాతం జరుగుతుంద’ని వెరైటీ డాట్ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment