
హీరోయిన్ నటాషా సూరి (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై : క్రికెటర్లు, బాలీవుడ్ భామలకు పరిచయాలు ఎక్కువగా పెళ్లివైపు దారి తీస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇటీవల క్రికెటర్ డ్వేన్ బ్రేవో, నటి-మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి గురించి వదంతులు షికార్లు చేశాయి. ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌కు హాజరైన హీరోయిన్ నటాషా సూరి వీఐపీ గ్యాలరీలో కూర్చుని సపోర్ట్ చేయగా ఓడిపోతుందనుకున్న చెన్నై జట్టుకు బ్రేవో విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్‌కు ముందు వీరు ముంబై హోటల్‌లో కలిసి దిగిన ఫొటోలను నటాషా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వదంతులు వ్యాపించాయి. కాగా, బ్రేవో, తనకు మధ్య ఉన్న రిలేషన్‌పై నటాషా స్పందించారు. 'ఇక నుంచి వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టండి. బ్రేవ్, నేను డేటింగ్ చేయడం లేదు. నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. బ్రేవో గ్రేట్ క్రికెటరే కాదు మంచి గాయకుడు కూడా. అందుకు అతడ్ని నేను ఇష్టపడుతున్నాను. బ్రేవో, నేను మంచి స్నేహితులం. ఇద్దరి మధ్య సంభాషణ, అన్యోన్యత సమయంలో దిగిన ఫొటోలు షేర్ చేశామంటే.. వాళ్లు రొమాన్స్ చేస్తున్నారని భావించవద్దు. ఆడ, మగ కలిసి ఉన్న ఫొటోలు చూపిస్తూ ఏదో కథలు అల్లడం ఆపివేయడం మంచిది. మళ్లీ చెబుతున్నాను. నేను, బ్రేవో స్నేహితులం మాత్రమే. ధన్యవాదాలు' అంటూ నటాషా తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
'స్నేహితుడు బ్రేవోకు ఆల్ ద బెస్ట్. మ్యాచ్ చూసేందుకు నాకు స్పెషల్ టికెట్లు ఇప్పించావు. నువ్వు బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించావని' ఐపీఎల్ తొలి మ్యాచ్ అనంతరం ఆమె పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ వీరు మధ్య స్పెషల్ రిలేషన్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.