ఐపీఎల్: షకీబ్ వర్సెస్ డ్వేన్ బ్రేవో.. | Shakib Al Hasan Getting Bravo Wicket Thrice In 4 Innings | Sakshi
Sakshi News home page

ఐపీఎల్: షకీబ్ వర్సెస్ డ్వేన్ బ్రేవో..

Published Sun, May 13 2018 3:21 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

Shakib Al Hasan Getting Bravo Wicket Thrice In 4 Innings - Sakshi

షకీబ్ అల్ హసన్, డ్వేన్ బ్రేవో

సాక్షి, పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11వ సీజన్‌లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర పోరును
సన్‌రైజర్స్ జట్టు ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, చెన్నై బెస్ట్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోల మధ్య పోరుగా చూస్తోంది. చెన్నైతో ఆడిన మ్యాచ్‌లలో బ్రేవో బ్యాటింగ్ చేసిన నాలుగు ఇన్నింగ్స్‌లకు గానూ మూడు పర్యాయాలు అతడి వికెట్‌ను సన్‌రైజర్స్ బౌలర్ షకీబ్ పడగొట్టాడు.

దాంతో పాటుగా ఆ ఇన్నింగ్స్‌లలో షకీబ్ వేసిన 12 బంతులను ఎదుర్కొన్న బ్రేవో.. సగానికి పైగా బంతులకు పరుగులు చేయలేకపోయాడు. హార్డ్ హిట్టర్‌గా పేరున్న బ్రేవోను తన తెలివైన బంతులతో షకీబ్ బోల్తా కొట్టించాడని.. నేటి మ్యాచ్‌లో బ్రేవో వికెట్ తీస్తాడా.. లేక డాట్ బాల్స్ సంఖ్య పెంచుతుడో చూద్దామంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నై, హైదరాబాద్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement