Natasha Suri
-
‘నా పేరుతో అసభ్యకర ఫొటోలను పోస్టు చేశాడు’
తన పేరుతో అభ్యంతరకర వార్తలను ప్రచురిస్తూ.. మానసికంగా వేధిసున్నాడంటూ ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తిపై సూపర్ మోడల్, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటషా సూరి ముంబై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన లాయర్ మాధవ్ వి. తోరత్‌తో కలిసి దాదర్ పోలీసు స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. తన పేరుతో పబ్లిక్ వెబ్సైట్లలో అసభ్యకరమైన పోస్టులను ప్రచురిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2019లో నవంబర్‌లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని నా పేరుతో ప్రచురించడం మొదలు పెట్టారు. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటివి చాలా వచ్చాయి. ఎవరో కావాలనే ఇలా చేశారనుకున్న. క్రమంగా అవి తారస్థాయికి చేరాయి. ఏకంగా నా పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతాలను తెరిచి... అభ్యంతరకర వార్తలకు బాత్రూంలో ఉన్న అసభ్యకర అమ్మాయిల ఫొటోల ముఖాన్ని బ్లర్ చేసి వాటికి నటషా సూరి సింగ్ అనే పేరుతో షేర్ చేశాడు. దీన్నిబట్టి చూస్తే అతను నన్న లక్ష్యంగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లుగా నాకు అర్థమైంది. అలాగే పోర్న్సైట్లలో తల లేని శరీరాన్ని తీసుకుని వాటిని నా పేరుతో ప్రచురించడంతో గూగుల్‌లో ఆ ఫొటోలు నా పేరుతో వస్తున్నాయి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ సిద్దార్థ శుక్లా తనను వేధిస్తన్నట్లు.. ప్లిన్ నకిలీ వార్తలు ప్రచారం చేశాడని నటాషా పోలీసులకు తెలిపారు. ‘నా జీవితంతో ఇంతవరకు నేను శుక్లాను కలవనే లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు’ అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఆ వ్యక్తి కావాలనే తనను వివాదాల్లోకి లాగుతున్నాడని అర్థమైందన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసెందుకే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నటషా 2006లో ఫెమినా మిస్ ఇండియా (వరల్డ్) టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలో టాప్-10లో ఆమె నిలిచారు. ఆ తరువాత 2016లో వచ్చిన మలయాళ ‘కింగ్ లయర్’ చిత్రంలో నటించారు. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. -
క్రికెటర్‌తో రిలేషన్.. హీరోయిన్ క్లారిటీ
సాక్షి, ముంబై : క్రికెటర్లు, బాలీవుడ్ భామలకు పరిచయాలు ఎక్కువగా పెళ్లివైపు దారి తీస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇటీవల క్రికెటర్ డ్వేన్ బ్రేవో, నటి-మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి గురించి వదంతులు షికార్లు చేశాయి. ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌కు హాజరైన హీరోయిన్ నటాషా సూరి వీఐపీ గ్యాలరీలో కూర్చుని సపోర్ట్ చేయగా ఓడిపోతుందనుకున్న చెన్నై జట్టుకు బ్రేవో విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్‌కు ముందు వీరు ముంబై హోటల్లో కలిసి దిగిన ఫొటోలను నటాషా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వదంతులు వ్యాపించాయి. కాగా, బ్రేవో, తనకు మధ్య ఉన్న రిలేషన్‌పై నటాషా స్పందించారు. 'ఇక నుంచి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టండి. బ్రేవ్, నేను డేటింగ్ చేయడం లేదు. నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. బ్రేవో గ్రేట్ క్రికెటరే కాదు మంచి గాయకుడు కూడా. అందుకు అతడ్ని నేను ఇష్టపడుతున్నాను. బ్రేవో, నేను మంచి స్నేహితులం. ఇద్దరి మధ్య సంభాషణ, అన్యోన్యత సమయంలో దిగిన ఫొటోలు షేర్ చేశామంటే.. వాళ్లు రొమాన్స్ చేస్తున్నారని భావించవద్దు. ఆడ, మగ కలిసి ఉన్న ఫొటోలు చూపిస్తూ ఏదో కథలు అల్లడం ఆపివేయడం మంచిది. మళ్లీ చెబుతున్నాను. నేను, బ్రేవో స్నేహితులం మాత్రమే. ధన్యవాదాలు' అంటూ నటాషా తాజాగా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. 'స్నేహితుడు బ్రేవోకు ఆల్ ద బెస్ట్. మ్యాచ్ చూసేందుకు నాకు స్పెషల్ టికెట్లు ఇప్పించావు. నువ్వు బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించావని' ఐపీఎల్ తొలి మ్యాచ్ అనంతరం ఆమె పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ వీరు మధ్య స్పెషల్ రిలేషన్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
డ్వేన్ బ్రేవో నుంచి నటికి ఐపీఎల్ టికెట్లు
సాక్షి, ముంబై : క్రికెటర్లు, బాలీవుడ్ భామలకు పరిచయాలు గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చివరగా గతేడాది విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో ఓ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్‌తో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. స్వయంగా నటి ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయడంతో వీరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి నటాషా సూరితో చెన్నై ప్లేయర్ బ్రేవో ముంబై హోటల్లో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా, ఆమెకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్రేవో అందిస్తున్నాడు. పదేళ్ల కిందట ఏర్పడిన పరిచయంతో భారత్ వచ్చిన ప్రతిసారి నటాషాను కలుస్తుంటాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ 11 సీజన్ ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌కు నటాషా వచ్చింది. గ్యాలరీలో కూర్చుని ఆమె సపోర్ట్ చేయగా బ్రేవో బ్యాటింగ్‌లో చెలరేగి ఆడి 30 బంతుల్లో 68 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న చెన్నైకి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 'స్నేహితుడు బ్రేవోకు ఆల్ ద బెస్ట్. మ్యాచ్ చూసేందుకు నాకు స్పెషల్ టికెట్లు ఇప్పించావు. నువ్వు బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించావని' ఆమె పోస్ట్ చేసింది. ఆమెకు మ్యాచ్ టికెట్ల కోసం బ్రేవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
బంగీ జంప్ ప్రమాదం.. నటికి గాయాలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, హోస్ట్, ఫెమినా మిస్ ఇండియా 2006 నటాషా సూరి పెద్ద ప్రమాదానికి గురయ్యారు. బంగీ జంప్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలిలా.. ఇండోనేషియాలో ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఇటీవల నటాషాకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఇండోనేషియా వెళ్లిన నటాషా ఓ లక్సరీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించారు. సహజంగానే అడ్వెంటర్ గేమ్స్‌లో పాల్గొనడం, సాహసాలు చేయడం ఆమెకు అలవాటు. దీంతో స్టార్ ప్రారంభించిన తర్వాత బంగీ జంప్ చేసేందుకు వెళ్లారు. చాలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆమె కిందకి బంగీ జంప్ చేయగా.. నడుముకున్న తాడు తెడిపోయి ఆమె లోయలో పడిపోయినట్లు సమాచారం. అయితే కింద రాళ్లు లాంటివి లేకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే 24 గడిస్తే గానీ నటాషా సూరి పరిస్థితిని వెల్లడించలేమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ - 2006 అందాల పోటీల్లో పాల్గొన్న నటాషా టాప్-10లో నిలిచారు. అనంతరం పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశారు. బాలీవుడ్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటాషా.. 2016లో దక్షిణాది సూపర్స్టార్లలో ఒకరైన హీరో దిలీప్ సరసన కింగ్ లయర్ అనే మలయాళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.