‘భోజనం’ తప్పిస్తే బుద్ది చెబుతాం
Published Fri, Sep 22 2017 2:12 PM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
విజయవాడ: విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంపై డ్వాక్రా మహిళలు నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల 85 వేల మంది ఉపాధి కోల్పోతారని, పైగా భోజనంలో నాణ్యత లోపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
కమీషన్లకు కక్కుర్తిపడి పథకాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. 15 సంవత్సరాలుగా డ్వాక్రా మహిళలతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే సీఎం చంద్రబాబుకు బుద్ది చెబుతామని హెచ్చరించారు.
Advertisement
Advertisement