సజ్జన్‌ కుమార్‌కు ఊరట | Dwarka Court grants anticipatory bail plea to senior Congress leader Sajjan Kumar | Sakshi
Sakshi News home page

సజ్జన్‌ కుమార్‌కు ఊరట

Published Wed, Dec 21 2016 3:22 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతకు ఊరట లభించింది. 1984నాటి సిక్కులపై దాడుల ఘటనకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌ కు ద్వారకా కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతకు ఊరట లభించింది. 1984నాటి సిక్కులపై దాడుల ఘటనకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌ కు ద్వారకా కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వ్యక్తిగతంగా, జామీనుగా రూ.లక్షతో రెండు వేర్వేరు బాండ్లు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు ఆయనకు కొన్ని షరతులు కూడా విధించింది.

దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకరించాలని, ఎవరి అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కూడా స్పష్టం చేసింది. 1984, అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక సజ్జన్‌ కుమార్‌ హస్తం ఉందంటూ ఆరోపణలు వెళ్లువెత్తాయి. బాధితులు కూడా కేసులు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement