దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి బాధితులకు పరామర్శ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసులో పోలీసులు
- దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో హైకోర్టు
- జగన్, జోగి రమేశ్ తదితరుల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి బాధితులకు పరామర్శ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తే జగన్ తదితరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవ చ్చునని ఉమ్మడి హైకోర్టు తెలిపింది. ఒకవేళ పోలీసులు ఈ కేసులో ముందుకెళ్లాలంటే సీఆర్‌పీసీ సెక్షన్ ‘41 ఏ’ తప్పక అనుసరించాల్సిందేనని న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గ దర్శకాలను సైతం పాటించాల్సిందేనన్నారు.
దీనికి సంబంధించి కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేత జోగి రమేశ్, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. టీడీపీ ఎంపీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు ఈ ఏడాది ఫిబ్రవరి 28న కృష్ణా జిల్లా మూలపాడు వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో డ్రైవర్ సహా 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.