
అతనితో నేను డేటింగ్ చేయడంలేదు: శ్రియ
వెస్టిండీస్ క్రికెటర్ డ్వెన్ బ్రావోతో నటి శ్రియ శరణ్ డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆమె వివరణ ఇచ్చింది.
ముంబై: వెస్టిండీస్ క్రికెటర్ డ్వెన్ బ్రావోతో నటి శ్రియ శరణ్ డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆమె వివరణ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, మామూలుగా లంచ్ కోసమే రెస్టారెంట్కు వెళ్లానని చెప్పింది. తాను ప్రస్తుతం సింగిల్గా ఉన్నానని, జీవితం సంతోషంగా ఉందని శ్రియ అంది.
ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి డ్వెన్ బ్రావోతో కలసి శ్రియ బయటకు వస్తున్నప్పటి దృశ్యం మీడియా కంటపడటం.. ఈ ఫొటోలు పత్రికల్లో రావడం.. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్లను శ్రియ కొట్టిపారేసింది. బాలీవుడ్ సినిమా దృశ్యంలో నటించిన శ్రియ ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.