
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల రుణాలు, రైతు రుణాలు రద్దు చేస్తామని చెప్పి నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ముంచారన్నా అంటూ కాళ్ల గ్రామానికి చెందిన శివపార్వతి డ్వాక్రా సంఘ సభ్యులు గ్రంధి జానకి, నారి కాశీ అన్నపూర్ణ, నారిన నాగమణి అనే మహిళ కాళ్ల గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.మూడు లక్షల వరకు రుణాలు తీసుకున్నామని, అసలు, వడ్డీ కలిపి ఎక్కువై కూర్చొందన్నారు.