మండలంలోని డ్వాక్రా మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెలుగు కిరణం మండల సమాఖ్య భవన నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాలేదు.
లక్ష్మణచాంద్ : మండలంలోని డ్వాక్రా మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెలుగు కిరణం మండల సమాఖ్య భవన నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాలేదు. భవనం లేకపోవడంతో డ్వా క్రా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా సంఘాలకు ఎటువంటి ఇ బ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో 2011-2012లో భవన నిర్మాణానికి 25 లక్షల రూపాలయను మంజూరి చేసింది.అప్పుడు మొదలైన పనులు 2016 పూర్తయ్యాయి.
నిధుల లేమితో అసంపూర్తిగా:
నాలుగేళ్ల క్రితమే నిర్మాణ పనులు మొదలైనప్పటికి 25లక్షల రూపాయలు నిధులు సరిపోకపోవడంతో అప్పటి కాంట్రాక్టర్ భవన నిర్మాణం ప నులను మధ్యలోనే వదిలేసాడు. భవన ని ర్మాణం వెలుపల పూర్తి అయినా లోపల మరుగుదొడ్లు ,విద్యుత్, ఫ్లోరింగ్ పనులు పూర్తి కాలేదు. నిర్మాణానికి నిధులు మంజురు కాక మండల సమాఖ్య భవన నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అలాగే ఉండి పోయింది.
రెండో విడతగా 2016లో 7 లక్షలు మంజురయ్యాయి. వాటితో మిగిలిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం భవనం కనీస అవసరాలతో సౌకర్యంగా ఉంది. అయినప్పటికి అధికారులు భవనాన్ని వినియోగంలోకి తేవటంలేదు. త్వరగా భవనాన్ని ప్రారంభించాలి. ఇన్ని రోజులు అరకొరా సౌకర్యాలతో అద్దె భవనంలో ఉన్నాం. కొత్త భవనాన్ని ప్రారంభించి తమ సమస్యలు పరిష్కరించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
అద్దె భవనంలో వెలుగు కిరణం కార్యాలయం
వెలుగు కిరణం భవనం నిర్మాణం పూర్తికాకపోవడంతో సంవత్సరాల తరబడిగా అద్దె భవనాల లోనే కార్యాలయం కొనసాగుతోంది. అరాకొర సదుపాయాలతో నెలకు 2500 రూపాయలను చెల్లించుకుంటూ పనులు చేసుకుంటున్నారు.
త్వరగా అందుబాటులోకి తేవాలి
సొంత భవనం లేకపోవడంతో ఇన్ని రోజులు కార్యలయాన్ని అద్దె భవనంలో నడిపించారు. అందులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విధుల నిర్వహించటం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అద్దె భవనం రెంటు పెంచుతామని అంటున్నారు. కొత్త భవనంలోకి మారిస్తే ఖర్చు తగ్గుతుంది. నిర్వహణ సులభంగా ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భవనాన్ని ప్రారంభించాలి.
- నారాయణ,ఏపీఓ
వారంలో అందుభాటులోకి తెస్తాం
నిధులలేమితో ఇన్ని రోజులు మండల సమాఖ్య భవన నిర్మాణం పూర్తి కాలేదు. నిధుల మంజూర కావడంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు కూడా పూర్తి అయ్యాయి. భవనంలోపల గల మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. నెలాఖరులోగా మండల సమాఖ్య భవనంలో మిగిలిన పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తాం. త్వరలోనే భవనాన్ని వెలుగు కిరణం వారికి అప్పజెప్పుతాము.
- సురేంధర్‌రెడ్డి,ఏఈ,పీఆర్