దీక్షలను విరమింపజేస్తున్న డీఎస్పీ వాసుదేవన్
ప్రొద్దుటూరు క్రైం/ప్రొద్దుటూరు: పొదుపు సంఘం డబ్బు స్వాహా కేసులో టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. బంగారులక్ష్మి సమాఖ్య పరిధిలోని 30 డ్వాక్రా గ్రూపులకు సం బంధించి రూ.31,83,097కు పైగా అవినీతి జరి గినట్లు మున్సిపల్ అధికారులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, రూ.30 లక్షలకు పైగా డబ్బు స్వాహాచేశారని మహిళలు గతనెలలో లక్ష్మీనారాయణమ్మ ఇంటిముందు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న తమపై లక్ష్మీనారాయణమ్మ కుటుంబసభ్యులు దాడిచేశారని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తమను మోసం చేసిన లక్ష్మీనారాయణ మ్మకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ మహిళలు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేశారు.
వారిపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లక్ష్మీనారాయణమ్మ వద్ద ఉన్న రికార్డులను స్వా« దీనం చేసుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.31,83,097కు పైగా అవినీతి జరిగినట్లు తేలిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు.
మహిళల ఆత్మగౌరవ దీక్ష విరమణ
డ్వాక్రా మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారా>యణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను అరెస్ట్ చేయాలంటూ వారం రోజులుగా కొనసాగుతున్న ‘ప్రొద్దుటూరు మహిళల ఆత్మగౌరవ దీక్ష’ను గురువారం విరమించారు. దీక్ష చేస్తున్న మహిళలకు కడప దిశ డీఎస్పీ వాసుదేవన్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
చివరిరోజు దీక్షలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీటీసీ సభ్యురాలు బాలగుర్రమ్మ, మాజీ కౌన్సిలర్లు వుట్టి రమణమ్మ, రమాదేవి, మాజీ సర్పంచ్ రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి కూర్చున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment