
'డ్వాక్రా సంఘాలను సీఎం బెదిరించారు'
ఏలూరు: రెయిన్ గన్స్ పేరుతో సీఎం చంద్రబాబునాయుడు రూ.300 కోట్లు దోచుకున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావని, సమస్యలు ఎదుర్కొంటారని సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను బెదిరించడం దారుణమని రఘువీరా మండిపడ్డారు.