బండరాయితో మోది హత్య
వేధింపులే కారణం
సుల్తానఖపూర్‌లో దారుణం
పులఖకలఖ: కన్నకొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. కొడుకు పెట్టేబాధలు భరించలేక విధిలేని పరిస్థితిలో బండరాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని సుల్తానఖపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు చోటుచేసుకుంది. ?సఐ సత్యనారాయణ, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.... గ్రామానికి చెందిన జార్జి స్థానికంగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు రాజు(23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. పనిలేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. రోజూ డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డబ్బులు కావాలంటూ తండ్రి జార్జితో గొడవ పడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇంట్లో నుంచి తండ్రిని గెంటేశాడు. దీంతో జార్జి బయటకు వచ్చేశాడు.
కొద్దిసేపటికే రాజు మద్యం మత్తులో కింద పడిపోయాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న తండ్రి జార్జి అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి బండరాయితో రాజు తలపై మోదాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ?సఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని కేసు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ రాజారత్నం సోమవారం సుల్తానఖపూర్‌ను సందర్శించారు. హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తుచేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
తండ్రి చేతిలో కొడుకు హతం
Published Tue, Dec 1 2015 12:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement