
ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తాడట..మరిప్పుడు.. కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న ఓ గిరిని మనమే ‘ఎత్తేయొచ్చు’!!అదెలా తెలుసుకోవాలంటే.. చలో మరి.. ఫ్రాన్స్ లోని హ్యూల్‌గోట్ అటవీ ప్రాంతానికి.. ఎందు కంటే.. ఇక్కడ ఎలాంటి మ్యాన్ అయినా.. సూపర్ మ్యాన్ అయిపోతాడు.. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఓ భారీ బండ ఒకటి ఉంది..7 మీటర్ల పొడవుండే.. దాని బరువు 1.37 లక్షల కిలోలు.. వినగానే.. దీన్ని కదపడం కూడా అసాధ్యమనే అనిపిస్తోంది కదూ..
అయితే.. ప్రపంచంలోని అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా దీన్ని సూపర్‌మ్యాన్ స్థాయిలో ఎత్తే యొచ్చు లేదా సులువుగా కదిలించొచ్చు.. ఎలా మ్యాజిక్కా అంటే.. కాదు అచ్చంగా లాజిక్కే! ఈ బండ ఉన్న ప్రదేశమే దీనికి కారణం.. సమతలంగా ఉన్న ఓ భారీ రాతి భాగంపై ఈ బండ బాలెన్సింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. దాని వల్ల కొన్ని నిర్దేశిత ప్రదేశాల్లో ట్రైచేస్తే.. దీన్ని లైట్‌గా ఎత్తొచ్చు లేదా కదపొచ్చు. ఇంత విశేషం ఉంది కాబట్టే.. దేశ విదేశాల నుంచి వేలాదిగా పర్యాటకులు ఈ బండను ఎత్తడానికి ఇక్కడికి వస్తుంటారు.. భీముడంతటి తమ భుజశక్తిని ప్రదర్శించుకుని మురిసిపోతుంటారు.
చదవండి: దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది
Comments
Please login to add a commentAdd a comment