Mother Shipton’s Cave This Spring Water Turning Things To Stone Really Does sound like something straight out of a children’s book: జై బజరంగభళి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ బావిలో పడగానే ఐరన్ మ్యాన్ అయిపోతాడు గుర్తుందా! అది కల్పితమైనప్పటికీ ఈ భూమిపై అటువంటి ఓ జలపాతం ఉందండి.. ఈ నదిలో ఏ వస్తువును వేసినా.. అది ఇనుములా గట్టిగా అయిపోతుంది. ప్రకృతిలో ఇలాంటి వింతలు కూడా ఉన్నాయిమరి. అసలిది ఎలా సాధ్యమని బుర్ర గోక్కోకండి. దీని వెనుక ఓ సైన్స్ సీక్రేట్ దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా..
ఇంగ్లాండ్‌లోని మదర్ షిప్టాన్స్ కేవ్ గురించే మనం చర్చిస్తోంది. దీనిని డ్రాపింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1630లో మొదటిసారిగా ప్రజల సదర్శన కోసం తెరిచారు. ఈ భూప్రపంచంలో ప్రజలను అత్యంత అధికంగా ఆకట్టుకునే ప్రదేశాల్లో ఇదీ కూడా ఒకటి . వందల సంవత్సరాలుగా ఈ ప్రదేశానికి తరగని క్రేజ్ ఉంది. ఇక్కడి నీటి బుగ్గ నుండి బయటికి ఉబికి వచ్చే నీళ్లు జలపాతంలా కిందికి జారుతూఉంటాయి. ఐతే ఈ నీళ్లలో ఏవస్తువునైనా ఉంచితే అది వెంటనే రాయిలా గట్టిపడిపోతుంది. దీనిని చూడటానికి వచ్చే సందర్శకులకు.. పొరపాటున జారి ఈ నీళ్లలో పడితే మేముకూడా రాయిలా అయిపోతామేమోననే భయం కూడా లేకపోలేదు.
చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
ఈ నీటిబుగ్గ గురించి స్థానికంగా ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. మదర్ షిప్టాన్ (ఉర్సులా సౌతెయిల్ అని కూడా పిలుస్తారు)అనే బాలిక ఓ వేశ్యకు ఈ గుహలో జన్మించిందట. ఐతే ఆమె వికృత రూపాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు దెయ్యమని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఐతే ఆమె వేశ్య కుమార్తె రూపంలో వచ్చిన పురాతన చెడుకు నిలయంగా అక్కడి ప్రజలు చెబుతారు.
ఏదిఏమైనప్పటికీ దీని వెనుక దాగి ఉన్న సైన్స్ రహస్యమేమంటే..
ఇక్కడి నీటి బుగ్గ నుంచి వెలువడే నీటి లక్షణాల వల్లనే వస్తువులు రాయిలా మారిపోతున్నాయి. ఈ స్ప్రింగ్ నుండి వచ్చే నీటిలో పెద్ద మొత్తంలో కరిగే సున్నపురాయి ఉంటుంది. ఫలితంగా ఈ నీరు దేనినైనా తాకినప్పుడు, సున్నపురాయి నిక్షేపాలు వాటిపై ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇక ఎక్కువకాలం ఈ నీటిలో ఉంచితే సున్నపురాయి నిక్షేపాలు పొరలా ఏర్పడి ప్రతి వస్తువును రాయిగా మారుస్తుంది.
ప్రజలు దశాబ్దాలుగా సున్నపురాయి అధికంగా ఉన్న ఈ నీటిలో వస్తువులను వేలాడదీస్తున్నారు. 1850లో వేలాడదీసిన టోపీలు ఈ నాటికీ ఉన్నాయక్కడ.
ఓ వ్యక్తి ఈ నీటిలో సైకిల్ కూడా పెట్టాడు. అది ఏవిధంగా రాయిగా మారుతుందో చూడాలనుకున్నాడేమో. ఇది దాదాపుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన కళాఖండంలా కనిపిస్తుంది.
చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..
లైమ్ స్టోన్‌లో చాలామంది టెడ్డీబేర్‌లను కూడా వేలాడదీస్తారు.
వేల సంవత్సరాలుగా నీటి తాకిడికి గురైన ఈ కొండ ఇలా గోడలా రూపొందింది.
మినరల్స్ అధికంగా ఉండే ఈ సహజ నీటి బుగ్గ పైభాగమిది.
ఈ విధమైన నీటి వనరుల గురించి ఇది వరకెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. భూమిపై ఇలాంటివి ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీరు వస్తువులను రాయిగా మార్చడం అనేది నిజంగా ఏ భేతాల కథల పుస్తకం నుండి బయటికి వచ్చిన దృశ్యంలా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంగ్లండ్‌కు వెళ్లితే ఆ మ్యాజికల్ వాటర్ ఫాల్ చూడటం మాత్రం మర్చిపోకండే!
చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment