water fall
-
ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'!
కొన్ని పుకార్లు ఎంతగా భయపడతాయంటే..తరాలు మారిన ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థంకానీ మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే..కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ చేధనలో కనిపించి వామ్మో! ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది!. ఇప్పటికీ ఆ వాటర్‌ఫాల్ వద్దకు రాత్రుళ్ల వెళ్లాలంటే హడలే..! అది మేఘాలయలోని ‘రంగ్జిర్తెహ్’ గ్రామం. ఇది ‘లికాయి’ అనే స్త్రీ కథ. లికాయికి యుక్తవయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్నిరోజులకే.. అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచటం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు.. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే ఎన్నుకుని రెండో పెళ్లి చేసుకుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు.. ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపునిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు, వక్క వేసుకుని తృప్తిగా తేన్చాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి.. పిచ్చిదానిలా కేకలుపెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దపెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ.. మేఘాలయలోని ‘నోహ్కలికాయి వాటర్ ఫాల్స్’ ముందుండే పెద్ద బోర్డ్ మీద.. ఓ పురాణ గాథలా కనిపిస్తుంటుంది. ఈ ఉదంతం తెలిసిన వాళ్లంతా.. ఆ జలపాతం ‘ఓ కన్నతల్లి గుండె కోత’ అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రి పూట ఇక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. లికాయి.. ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మేవాళ్లంతా.. ఈ కథకు హారర్ టచ్‌ని ఇచ్చి.. మరింతమందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యథ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: 'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..) -
ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్‌ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్పామ్ ఉంది. రావణుడి గుహలు రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్‌కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి. జ్ఞాపికలే పెద్ద వ్యాపారం శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్‌ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్లుంటాయి. మక్కబుట్టకు ఉప్పుకారం చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!) -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్
ఇటీవల కాలంటో స్టంట్ల క్రేజ్ మామాలుగా లేదు. కొంతమంది సోషల్ మీడియా స్టార్డమ్ కోసం ఎలాంటి స్టంట్లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్ చేసే స్టంట్‌కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే... బ్రెజిల్‌కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్‌ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో బ్రైజిల్ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంతేగాదు బ్రెజిల్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్ 25న మాటో గ్రాస్ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. É sério que acharam uma boa ideia colocar corante numa cachoeira?! Tantas maneiras de fazer um chá revelação e conseguiram escolher justo uma com impacto ambiental. pic.twitter.com/YePJ0lPhhQ — A Eng. Florestal do YouTube 🌳 (@vanecosta10) September 26, 2022 (చదవండి: ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్) -
భూలోక స్వర్గమంటే ఇదేనా.. ఈ జలపాతాలు తప్పక చూడాల్సిందే!
ప్రకృతిలో ఎన్నో సుందర దృశ్యాలు కళ్లు ముందు కనిపిస్తుంటాయి. వాటిని చూసినపుడు ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాగా, వానాకాలంలో వాటర్ ఫాల్స్‌ను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రపంచంలో ఫేమస్ జలపాతం అనగానే.. అందరికీ నయాగరా వాటర్ గుర్తుకు వస్తాయి. కాగా, మన దేశంలో కూడా నయాగరా వాటర్ ఫాల్స్‌కు తీసిపోని ఓ జలపాతం ఉంది. అంతకుమించిన అందాలు.. కర్ణాటకలోని ఉన్నాయి. షిమోగా జిల్లాలోని జోగ్ జెర్సొప్పా జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం ఎంతో సుందరంగా కనిపిస్తోంది. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుంచి వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశమని ఓ విదేశీ టూరెస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు. ఇది నయాగరా ఫాల్స్ కాదు. జోగ్ ఫాల్స్. అద్భుతమైన వీడియో చూడండి వ్యాఖ్యలు చేశారు. Incredible india... - This is not Niagara Falls… This is Jog Falls, located in Shimoga district of Karnataka, India....#jogfalls#NiagaraFalls#Telanganarains#rainyday pic.twitter.com/gkkLxT3Drl — Das Vanthala (@DasVanthala) July 13, 2022 ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో జలపాతాలు సైతం భారీ వర్షాల కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో ములుగు జిల్లాలోని భోగతా, ఆదిలాబాద్‌లోని కుంతాల, ఆసిఫాబాద్‌లోని మిట్టే జలపాతాలు కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలనే మరో నెటిజన్.. కేరళలోని త్రిసూర్ జిల్లా అత్తిరప్పిల్లి జలపాతాలను మర్చిపోవద్దంటూ ట్వీట్ చేశాడు. #Bogatha Waterfall In Full Flow 😍👌#WaterfallsOfTelangana 📸: @HiWarangalpic.twitter.com/2bCK47nFnC — Hi Hyderabad (@HiHyderabad) July 9, 2022 Mitte Waterfalls Asifabad District, Telangana 📸: @PraneethSimon #WaterfallsOfTelangana pic.twitter.com/crVjPDV7RY — Hi Hyderabad (@HiHyderabad) July 10, 2022 -
మనసు దోచె.. మత్తిలి అందాలు!
సాక్షి, భవనేశ్వర్: మత్తిలి సమితి అందాలను ఒక్కసారి తిలకిస్తే చాలు జన్మజన్మలకు మిగిలిపోయే మధుర స్మృతులు పర్యాటకుల సొంతమవుతాయి. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతంలో ఎత్తైన కొండలు, జలపాతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. మత్తిలి ప్రధాన రహదారికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని గంగారాజగుమ్మ గ్రామ దగ్గరి జలపాతం అయితే చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కడి బండరాళ్ల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం పరవళ్లు నుంచి వచ్చే శబ్దాలు విని వీక్షకులు మంత్రముగ్ధులవుతుంటారు. బండరాయిపై గీసిన ఏనుగు బొమ్మపై కూర్చొని సరదా పడుతున్న బాలుడు ప్రస్తుతం అక్కడి ‘వ్యూ’ని చూసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కర్రల వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం పిక్నిక్ స్పాట్‌గా వెలుగొందుతున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతుండడం విశేషం. – మల్కన్‌గిరి ఐ లవ్ మత్తిలి పెయింట్ వర్క్ కర్రల వంతెనపై నుంచి వ్యూ చూస్తున్న పర్యాటకులు -
అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!
Mother Shipton’s Cave This Spring Water Turning Things To Stone Really Does sound like something straight out of a children’s book: జై బజరంగభళి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ బావిలో పడగానే ఐరన్ మ్యాన్ అయిపోతాడు గుర్తుందా! అది కల్పితమైనప్పటికీ ఈ భూమిపై అటువంటి ఓ జలపాతం ఉందండి.. ఈ నదిలో ఏ వస్తువును వేసినా.. అది ఇనుములా గట్టిగా అయిపోతుంది. ప్రకృతిలో ఇలాంటి వింతలు కూడా ఉన్నాయిమరి. అసలిది ఎలా సాధ్యమని బుర్ర గోక్కోకండి. దీని వెనుక ఓ సైన్స్ సీక్రేట్ దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా.. ఇంగ్లాండ్‌లోని మదర్ షిప్టాన్స్ కేవ్ గురించే మనం చర్చిస్తోంది. దీనిని డ్రాపింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1630లో మొదటిసారిగా ప్రజల సదర్శన కోసం తెరిచారు. ఈ భూప్రపంచంలో ప్రజలను అత్యంత అధికంగా ఆకట్టుకునే ప్రదేశాల్లో ఇదీ కూడా ఒకటి . వందల సంవత్సరాలుగా ఈ ప్రదేశానికి తరగని క్రేజ్ ఉంది. ఇక్కడి నీటి బుగ్గ నుండి బయటికి ఉబికి వచ్చే నీళ్లు జలపాతంలా కిందికి జారుతూఉంటాయి. ఐతే ఈ నీళ్లలో ఏవస్తువునైనా ఉంచితే అది వెంటనే రాయిలా గట్టిపడిపోతుంది. దీనిని చూడటానికి వచ్చే సందర్శకులకు.. పొరపాటున జారి ఈ నీళ్లలో పడితే మేముకూడా రాయిలా అయిపోతామేమోననే భయం కూడా లేకపోలేదు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? ఈ నీటిబుగ్గ గురించి స్థానికంగా ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. మదర్ షిప్టాన్ (ఉర్సులా సౌతెయిల్ అని కూడా పిలుస్తారు)అనే బాలిక ఓ వేశ్యకు ఈ గుహలో జన్మించిందట. ఐతే ఆమె వికృత రూపాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు దెయ్యమని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఐతే ఆమె వేశ్య కుమార్తె రూపంలో వచ్చిన పురాతన చెడుకు నిలయంగా అక్కడి ప్రజలు చెబుతారు. ఏదిఏమైనప్పటికీ దీని వెనుక దాగి ఉన్న సైన్స్ రహస్యమేమంటే.. ఇక్కడి నీటి బుగ్గ నుంచి వెలువడే నీటి లక్షణాల వల్లనే వస్తువులు రాయిలా మారిపోతున్నాయి. ఈ స్ప్రింగ్ నుండి వచ్చే నీటిలో పెద్ద మొత్తంలో కరిగే సున్నపురాయి ఉంటుంది. ఫలితంగా ఈ నీరు దేనినైనా తాకినప్పుడు, సున్నపురాయి నిక్షేపాలు వాటిపై ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇక ఎక్కువకాలం ఈ నీటిలో ఉంచితే సున్నపురాయి నిక్షేపాలు పొరలా ఏర్పడి ప్రతి వస్తువును రాయిగా మారుస్తుంది. ప్రజలు దశాబ్దాలుగా సున్నపురాయి అధికంగా ఉన్న ఈ నీటిలో వస్తువులను వేలాడదీస్తున్నారు. 1850లో వేలాడదీసిన టోపీలు ఈ నాటికీ ఉన్నాయక్కడ. ఓ వ్యక్తి ఈ నీటిలో సైకిల్ కూడా పెట్టాడు. అది ఏవిధంగా రాయిగా మారుతుందో చూడాలనుకున్నాడేమో. ఇది దాదాపుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన కళాఖండంలా కనిపిస్తుంది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. లైమ్ స్టోన్లో చాలామంది టెడ్డీబేర్లను కూడా వేలాడదీస్తారు. వేల సంవత్సరాలుగా నీటి తాకిడికి గురైన ఈ కొండ ఇలా గోడలా రూపొందింది. మినరల్స్ అధికంగా ఉండే ఈ సహజ నీటి బుగ్గ పైభాగమిది. ఈ విధమైన నీటి వనరుల గురించి ఇది వరకెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. భూమిపై ఇలాంటివి ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీరు వస్తువులను రాయిగా మార్చడం అనేది నిజంగా ఏ భేతాల కథల పుస్తకం నుండి బయటికి వచ్చిన దృశ్యంలా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంగ్లండ్‌కు వెళ్లితే ఆ మ్యాజికల్ వాటర్ ఫాల్ చూడటం మాత్రం మర్చిపోకండే! చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
త్వరలోనే పెళ్లి.. అత్తింటికి వచ్చి కాబోయే అల్లుడు మృతి
కొలిమిగుండ్ల/ తాడిపత్రి రూరల్: త్వరలో పెళ్లి కావాల్సిన యువకుడు.. సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం కర్నూలు జిల్లాలోని లొక్కి గుండం జలపాతం వద్ద చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన అఖిల్‌సాయి (21)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు చెందిన అమ్మాయితో మూడు రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. నాగుల చవితి ముహూర్తాలకు వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అఖిల్‌సాయి అత్తగారి ఊరుకు వచ్చి యువతితో పాటు మరో ఇద్దరితో కలసి లొక్కిగుండంలో ఈతకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ అఖిల్‌సాయి గుండంలో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఎంత సేపటికీ బయటకు రాక పోవడంతో అమ్మాయి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చీకటి కావడంతో లైట్లు, తాళ్ల సాయంతో వెతికి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
పలమనేరు(చిత్తూరు జిల్లా) : సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లిన వ్యక్తి శవమైన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు కౌండిన్య అటవీ ప్రాంతంలోని గంగనశిరసు జలపాతం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. సముద్రపల్లి గ్రామానికి చెందిన కట్టెల సుబ్బయ్య కుమారుడు కట్టెల తిరుమలేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గంగనశిరసు జలపాతం హోరెత్తుతోందని తెలిసి స్నేహితులతో కలసి వెళ్లాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ చోటుకెళ్లి అక్కడి ఎత్తైన కొండల నుంచి కిందికి ప్రవహిస్తున్న నీటితో సహా తాను సెల్ఫీ తీస్తూ ప్రమాదవశాత్తు జలపాతంలోకి పడ్డాడు. పైకి రావడానికి సాధ్యం కాక అక్కడే మృతిచెందాడు. గుహల మధ్య వచ్చే నీటి ప్రవాహంలో ఓ చోట బండరాళ్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుపోయింది. తమతో వచ్చిన స్నేహితుడు లోయలో పడ్డారని ఆందోళన చెందిన వారంతా అతన్ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన పలువురు, చుట్టుపక్కల గ్రామస్తులు జలపాతానికి చేరుకున్నారు. అతికష్టమ్మీద మూడుగంటల పాటు కష్టపడి మృతదేహాన్ని బయటకులాగారు. ఆపై మూడు కిలోమీటర్ల మేర శవాన్ని మోసుకొచ్చి స్వగ్రామానికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమలేష్ మృతితో సముద్రపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వాటర్‌ఫాల్స్‌లో కొట్టుకుపోయిన యువకులు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. శివపురి, గ్వాలియర్ పరిధిలోని సుల్తాన్‌ఘర్ జలపాతంలో కొంతమంది యువకులు కొట్టుపోయారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురిని రక్షించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15సెలవు దినం, మరోపక్క వర్షాల కారణంగా నిండుగా కళకళలాడుతున్న జలపాతాలు. దీంతో దాదాపు 20మంది యువకులు జలపాతానికి పిక్నిక్కి వెళ్లారు. అయితే హఠాత్తుగా వరద నీరు పోటెత్తడంతో 11మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిక్నిక్ వెళ్లినవారు స్నానాలు చేస్తుండగా ఉధృతంగా నీరు కిందికి ప్రవహించడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. 100 అడుగుల ఎత్తు నుండి నీరు వేగంగా కిందికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెస్య్కూ టీం ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడిందనీ, పదకొండుమంది యువకులు కొట్టుకుపోయారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. దాదాపు 30-40మంది ఇంకా అక్కడే చిక్కుకు పోయినట్టు చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రంనుంచి భారీగా కురుస్తున్న వర్షం, చీకటి సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా నీటికి దిగువకు వదలడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్నేహితురాలు సరదాగా చేసిన పనికి..
-
స్నేహితురాలే జలపాతంలో తోసేసింది..
వాషింగ్టన్ : విహార యాత్రలో స్నేహితురాలు చేసిన పని ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల యువతి మంగళవారం స్నేహితులతో కలిసి వాషింగ్టన్ యాక్టోల్‌లోని మౌల్టన్ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. జలపాతం పైనున్న బ్రిడ్జి అంచున నిలుచున్న ఆమె జలపాతం అందాలను చూస్తుండగా.. వెనకాల నిల్చున్న స్నేహితురాలు ఒక్కరు ఆ యువతిని బలంగా తోసివేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా ప్రస్తుతం మారింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 5 ప్రక్కటెముకలు విరగడంతోపాటు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు కొలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ చర్యకు పాల్పడ్డ అమ్మాయి తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నా కూతురిని చంపాలని చూసింద’ని తెలిపారు. గతంలో కూడా ఈ జలపాతంలో దూకి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో సిబ్బంది అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతంలో దూకడం ప్రమాదకరమని.. కింద రాళ్లతో పాటు, లోతు కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. -
సియర్ బాబా జలపాతంల వద్ద విషాదం
-
జలపాతంలో స్నానం చేస్తుండగా విషాదం
జమ్మూ : జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రియాసి జిల్లాలోని సియర్ బాబా ఓ ఆధ్యాత్మిక ప్రదేశం కావటం వల్ల బాబా భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తుంటారు. అక్కడ ఉన్న జలపాతంలో చిన్నాపెద్ద స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై పడ్డాయి. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 25 మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం
-
తెలంగాణలో ఎత్తైన జలపాతం
-
జలపాత సోయగం
భారీ వర్షాలతో అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని మల్లాలమ్మ ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. అవుకు నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న దీనిని చూడటానికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. జలపాతం కింద స్నానం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. - అవుకు -
హైదరాబాద్‌లో లైవ్ వాటర్‌ఫాల్స్!
హైదరాబాద్: వర్షం వస్తే నగరం పూర్తిగా అస్త్యవ్యస్తంగా మారుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కూడా నగరవాసులను బెంబేలెత్తించింది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లని జలమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీనికితోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నగరంలోని మెట్రోమార్గంలో జలపాతాలు దర్శనమిచ్చాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని ఓ మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో ఫిల్లర్ నుంచి భారీగా నీళ్లు దూకడం నగరవాసులను ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ నగరంలో భారీ జలపాతంలేని లోటు తీరింది.. నగరంలో కొత్త పర్యాటక కేంద్రాన్ని నెలకొల్పిన మెట్రో రైల్‌కు ధన్యవాదాలంటూ నగరవాసులు ఈ వాటర్‌ఫాల్స్ వీడియోను సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో షేర్ చేసుకుంటున్నారు. -
కొండపై నుంచి ‘ఫైర్ఫాల్’
కాలిఫోర్నియా: ఇది అరుదైన, అద్భుతమైన చిత్రం. గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం ఇది మూడోసారి మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటో కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో వాలైంటైన్స్ డే రోజున తీసిన చిత్రం. ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి మంటల్లే కిందకు పారుతున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా అగ్నిపర్వతం నుంచి కిందకు లావా ప్రవహిస్తోందని పొరపాటు పడతారు. కానీ ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ ఆకృతి. వాస్తవానికి కొండపై నుంచి జాలువారేది సన్నటి వాటర్ ఫాల్. పడమటి సంధ్యలో అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ప్రతిఫలించడం వల్ల ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అరుదుగా ఫిబ్రవరి నెలలో కనిపించే ఈ దృశ్యానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. నిర్దిష్టమైన సూర్యుడి వేడికి కొండపైనున్న మంచుకరగి కిందకు జాలువారుతుంది. అప్పడు ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకుండా స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి. అప్పుడే ఈ దృశ్యం కనిపిస్తుంది. హార్స్టేల్గా పిలిచే ఫాటర్ ఫాల్, జాలువారుతున్న లావాలా కనిపిస్తుండడంతో దాన్ని ‘ఫైర్ఫాల్’ అని పిలుస్తున్నారు. పది నిమిషాలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని చూస్తూ జగతిని మైమరిచి తన్మయత్వంలో మునిగిపోయామని దీన్ని ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్, న్యూరో సైకాలజిస్ట్ సంగీతా డే తెలిపారు. ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఎంతో మంది ఫొటోగ్రాఫర్లు ప్రతి ఏడాది ఫిబ్రవరిలో పార్క్‌ను సందర్శిస్తారట, అయితే గత 11 ఏళ్లలో ఈ దృశ్యం కనిపించడం మూడోసారి మాత్రమే అని ఆమె చెప్పారు. తనకు మాత్రం ఈ అవకాశం అనుకోకుండా రావడం అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. మొట్టమొదటిసారిగా 1973లో గ్యాలెన్ రోవెల్ అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని ఫొటో తీశారు.