
హైదరాబాద్‌లో లైవ్ వాటర్‌ఫాల్స్!
హైదరాబాద్: వర్షం వస్తే నగరం పూర్తిగా అస్త్యవ్యస్తంగా మారుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కూడా నగరవాసులను బెంబేలెత్తించింది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లని జలమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీనికితోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నగరంలోని మెట్రోమార్గంలో జలపాతాలు దర్శనమిచ్చాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని ఓ మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో ఫిల్లర్ నుంచి భారీగా నీళ్లు దూకడం నగరవాసులను ఆశ్చర్యపరిచింది.
హైదరాబాద్ నగరంలో భారీ జలపాతంలేని లోటు తీరింది.. నగరంలో కొత్త పర్యాటక కేంద్రాన్ని నెలకొల్పిన మెట్రో రైల్‌కు ధన్యవాదాలంటూ నగరవాసులు ఈ వాటర్‌ఫాల్స్ వీడియోను సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో షేర్ చేసుకుంటున్నారు.