
ఆకట్టుకుంటున్న మత్తిలి జలపాతం
సాక్షి, భవనేశ్వర్: మత్తిలి సమితి అందాలను ఒక్కసారి తిలకిస్తే చాలు జన్మజన్మలకు మిగిలిపోయే మధుర స్మృతులు పర్యాటకుల సొంతమవుతాయి. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతంలో ఎత్తైన కొండలు, జలపాతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. మత్తిలి ప్రధాన రహదారికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని గంగారాజగుమ్మ గ్రామ దగ్గరి జలపాతం అయితే చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కడి బండరాళ్ల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం పరవళ్లు నుంచి వచ్చే శబ్దాలు విని వీక్షకులు మంత్రముగ్ధులవుతుంటారు.
బండరాయిపై గీసిన ఏనుగు బొమ్మపై కూర్చొని సరదా పడుతున్న బాలుడు
ప్రస్తుతం అక్కడి ‘వ్యూ’ని చూసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కర్రల వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం పిక్నిక్ స్పాట్‌గా వెలుగొందుతున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతుండడం విశేషం.
– మల్కన్‌గిరి
ఐ లవ్ మత్తిలి పెయింట్ వర్క్
కర్రల వంతెనపై నుంచి వ్యూ చూస్తున్న పర్యాటకులు