హజ్ యాత్ర జూన్ 26న ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో భాగంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది ముస్లింలు సౌదీ అరబ్‌లోని మక్కా చేరుకుంటారు. ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది. అదే సైతాన్‌ను రాళ్లతో కొట్టడం. ఈ ప్రక్రయ వెనుకనున్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సైతాన్‌ను రాళ్లతో కొట్టడం వెనుక..
‘హజ్’లో సైతాన్‌ను రాళ్లతో కొట్టే ప్రక్రియ ‘హజ్’లోని మూడవ రోజు జరుగుతుంది. ఆ రోజునే బక్రీద్ జరుపుకుంటారు. బక్రీద్ నాడు హజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు. అక్కడ వారు సైతాన్‌ను మూడు సార్లు రాళ్లతో కొడతారు. మీనా పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మితమైన వివిధ స్థంభాలను రాళ్లతో కొడతారు. దీనిలోని మొదటి స్థంభం జమ్రాహె ఉక్వా, రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా.
ఎందుకు ఇలా చేస్తారంటే..
ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘హజ్’లో పాల్గొన్నవారు రాళ్లతో మూడు స్థంబాలను కొడతారు. ఒకానొకప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్‌ను పారదోలేందుకు ఈ స్థంభాలను రాళ్లతో కొట్టారని చెబుతారు. ఆ సమయంలో హజ్రత్ ఇబ్రహీం తన కుమారునికి కుర్బానీ ఇచ్చేందుకు వెళుతుండగా సైతాన్ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. హాజీ ఈ స్థంభాలను సైతాన్‌కు ప్రతీకలుగా భావించి రాళ్లతో కొట్టారట. మొదటి రోజు హాజీ కేవలం మొదటి స్థంభాన్ని మాత్రమే కొట్టారు. తదుపరి రెండు రోజుల్లో మిగిలిన రెండు స్థంభాలను కొట్టారని చెబుతారు.
హజ్ యాత్ర నియమనిబంధనలివే..
హజ్ యాత్ర చేసే ముస్లింలు పలునిబంధనలు పాటిస్తారు. ఈ యాత్ర చేసేవారు తప్పనిసరిగా ముస్లింలు అయివుండాలి. ఈ యాత్రలో పాల్గొనేవారు ఎర్హమా ధరించాల్సి ఉంటుంది. ఈ యాత్రలో మహిళలు పాల్గొన్నట్టయితే వారు తల నుంచి పాదాలవరకూ కప్పివుండే దుస్తులు ధరించడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment