మెన్హిర్‌తో దాన్ని గుర్తించిన పరిశోధకులు
సాక్షి, హైదరాబాద్: అరుదుగా ఉండే పెట్రోగ్లిఫ్స్‌తో కూడిన మెన్హిర్ ఒకటి సూర్యాపేట–కోదాడ దారిలో కనిపించింది. మునగాల మండలంలోని మాదాల గ్రామ శివారులో పొలాల్లో ఉన్న ఈ 15 అడుగుల ఎత్తైన నిలువు రాయిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, వేముగంటి మురళి, సామ లేటి మహేశ్ గుర్తించారు. అది ఒకటి నుం చి మూడు శతాబ్దాల మధ్య కాలంనాటిది కావచ్చని భావిస్తున్నారు.
ఇక్కడ గతంలో ఆదిమానవుల సమాధులు ఎన్నో ఉం డేవి. కానీ కాలక్రమంలో వ్యవసాయ పొలాలు విస్తరించి ధ్వంసమయ్యాయి. మెన్హిర్ మాత్రం చెదరకుండా నిలిచి ఉంది. దీనిపై ఓవైపు చతురస్రం, అలల లాంటి ఆకా రా లు చెక్కి ఉన్నాయి. ఇవి లిపి గుర్తులా, వేరే బొమ్మలా అనేది గుర్తిం చాల్సి ఉందని హరగోపాల్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల, సిద్దిపేట సమీపంలోని పుల్లూరులలో లభించిన మెన్హిర్‌లపై ఇలాంటి పెట్రో గ్లిఫ్స్ కనిపించాయని చెప్పారు. గతంలో ఇక్కడ రాతియుగం ఆయుధాలు, పరుపు బండపై ఆయుధాలు నూరడంతో ఏర్ప డిన గంతలను గుర్తించారు. అరుదైన ఈ భారీ మెన్హిర్‌ను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు పరిశోధకులు సూచించారు.
ఏంటీ ఈ మెన్హిర్‌లు?
ప్రాచీనకాలంలో ప్రముఖులు, ఏదై నా సమూహం, పెద్ద వ్యక్తి సమాధి ముందు నిలువురాళ్లను పాతేవారు. మెన్హిర్‌గా పేర్కొనే ఇలాంటివి అక్కడ క్కడా దర్శనమిస్తున్నాయి. ఆరాళ్లపై గుర్తులు చెక్కడం (పెట్రో గ్లిఫ్స్) కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలా కొన్ని చిహ్నాలు చెక్కిన అరుదైన నిలువు రాయి తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటి రాళ్లపై అవగాహన లేని స్థానికులు వీటిని కూల్చి ఇతర అవసరాలకు వాడేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment