పోలీసును కొట్టి చంపారు
మాల్దా: రైలు ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి పదార్థాలు అమ్మకూడదని అడ్డుకున్న ఎస్ సమంత అనే ఆర్పీఎఫ్ పోలీసు అధికారిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ పశ్చిమ బెంగాల్ జిల్లాలోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మాల్దా రైల్వే స్టేషన్ ముఖ ద్వారం వద్ద ఓ వ్యక్తి ఏవో పదార్థాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో అతడి వద్దకు వెళ్లిన ఆర్పీఎఫ్ అధికారి వాటిని అమ్మకూడదని, వెళ్లిపోవాలని చెప్పాడు. కానీ అందుకు నిరాకరించిన అతడిపై పోలీసు చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడే చుట్టుపక్కల పలు తినుబండారాలు అమ్ముతున్న వారంతా పోగై రాళ్లతో ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అనంతరం ఆ పోలీసును బయటకు లాగి పిడిగుద్దులు కురిపించి రాళ్లతో కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.