వరంగల్ జిల్లా నర్మెట మండలం అంకుశాపూర్ గ్రామ మజరా బీల్వతాండాకు చెందిన గగులోత్ భాస్కర్(22) అనే యువకుణ్ణి గుర్తితెలియని వ్యక్తులు బండరాయితో మోది హతమార్చారు.
నర్మెట: వరంగల్ జిల్లా నర్మెట మండలం అంకుశాపూర్ గ్రామ మజరా బీల్వతాండాకు చెందిన గగులోత్ భాస్కర్(22) అనే యువకుణ్ణి గుర్తితెలియని వ్యక్తులు బండరాయితో మోది హతమార్చారు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని పంటపొలాల్లో యువకుని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్మెట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిఉంటుందని భావిస్తున్నారు.