చిట్టడవిలో భూత్‌బంగ్లా ఇదొక భూత్‌బంగ్లా. కెనడాలోని ఓంటారీయోకు చేరువలోని చిట్టడవిలో ఉంది. దాదాపుగా ముప్పయి ఏళ్లకు పైగా ఇది ఖాళీగానే ఉంది. పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని వింతలు విడ్డూరాలను అన్వేషించే అలవాటు ఉన్న డేవ్ అనే వ్యక్తి ఓంటారీయో శివార్లలోని చిట్టడవిలో వెదుకులాట సాగిస్తుండగా, ఈ భూత్‌బంగ్లా కనిపించింది. ఈ బంగ్లా లోపలకు వెళ్లే దారిలోనే భయం గొలిపే బొమ్మలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
డేవ్ ఈ భూత్‌బంగ్లాను, దాని పరిసరాలను తన కెమెరాలో బంధించాడు. రెండంతస్తుల ఈ బంగ్లాలోకి అడుగుపెట్టగానే హాలులో ఒక పాతకాలం టీవీ, ఎదురుగా ఒక కుర్చీ ఉన్నాయి. ప్రతి గదిలోనూ నేల మీద భీతి గొలిపే బొమ్మలు పడి ఉన్నాయి. పెచ్చులు ఊడిన పైకప్పు, రంగు వెలిసిపోయిన గోడలు, దుమ్ము ధూళితో నిండిన ఈ బంగ్లాలోకి అడుగుపెడితే ఏదో దయ్యాల కొంపలోకి అడుగుపెట్టినట్లే అనిపించిందని డేవ్ ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతడు చిత్రించిన ఈ భూత్‌బంగ్లా వీడియో కెనడాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.
(చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!)
Comments
Please login to add a commentAdd a comment