![Canada Wildfires Effects Darkens Skies Across Northern America - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/7/canada_wildfire.jpg.webp?itok=EnLzKLFc)
కెనడాలో కొనసాగుతున్న అడవి మంటల కారణంగా అధికారులు ఉత్తర అమెరికా అంతటా మిలియన్ల మంది ప్రజలకు హై-రిస్క్ ఎయిర్ క్వాలిటీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడియన్ రాజధానిలోని ప్రస్తుతమున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యానికి చాలా అధిక ప్రమాదంగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. టొరంటోతో పాటు దాని పరిసర ప్రాంతాలలో, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ సేపు బయట ఉన్నట్లయితే అనారోగ్యబారిన పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈశాన్య అమెరికాలో చాలా వరకు గాలి నాణ్యతను అనారోగ్యకరంగా మారినట్లు తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న శ్వాసకోశ సమస్యలున్న వ్యక్తులకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ పొగ ఉత్తరాన బోస్టన్ వరకు, దక్షిణాన పిట్స్‌బర్గ్, వాషింగ్టన్ డీసీ వరకు విస్తరించి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూ ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టాప్ 200లో ఉన్నాయి, అంటే ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
న్యూయార్క్‌లో, మంగళవారం ఉదయం తీసిన ఫోటోలు కెనడా నుండి దక్షిణ దిశగా ప్రయాణించిన అడవి మంటల పొగ కారణంగా నగరం స్కైలైన్‌పై నారింజ పొగమంచు కప్పినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఉన్న వ్యక్తులను ఈ పొగ అలుముకున్న ప్రాంతాల నుంచి ఖాళీ చేస్తున్నారు. కెనడా సాధారణం కంటే ఈ ఏడాది ఎక్కువ అడవి మంటలను సెగను చవి చూడాల్సి వస్తోంది. ప్రస్తుత సీజన్‌లో చాలా వరకు పొడి, వేడి పరిస్థితుల కారణంగా ఈ వేసవిలో కెనడాలో అతిపెద్ద మంటలు సంభవించవచ్చని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment