Bhoot Bungla
-
చిట్టడవిలో ఓ భూత్‌బంగ్లా..లోపలికి అడుగుపెడితే..
చిట్టడవిలో భూత్‌బంగ్లా ఇదొక భూత్‌బంగ్లా. కెనడాలోని ఓంటారీయోకు చేరువలోని చిట్టడవిలో ఉంది. దాదాపుగా ముప్పయి ఏళ్లకు పైగా ఇది ఖాళీగానే ఉంది. పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని వింతలు విడ్డూరాలను అన్వేషించే అలవాటు ఉన్న డేవ్ అనే వ్యక్తి ఓంటారీయో శివార్లలోని చిట్టడవిలో వెదుకులాట సాగిస్తుండగా, ఈ భూత్‌బంగ్లా కనిపించింది. ఈ బంగ్లా లోపలకు వెళ్లే దారిలోనే భయం గొలిపే బొమ్మలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. డేవ్ ఈ భూత్‌బంగ్లాను, దాని పరిసరాలను తన కెమెరాలో బంధించాడు. రెండంతస్తుల ఈ బంగ్లాలోకి అడుగుపెట్టగానే హాలులో ఒక పాతకాలం టీవీ, ఎదురుగా ఒక కుర్చీ ఉన్నాయి. ప్రతి గదిలోనూ నేల మీద భీతి గొలిపే బొమ్మలు పడి ఉన్నాయి. పెచ్చులు ఊడిన పైకప్పు, రంగు వెలిసిపోయిన గోడలు, దుమ్ము ధూళితో నిండిన ఈ బంగ్లాలోకి అడుగుపెడితే ఏదో దయ్యాల కొంపలోకి అడుగుపెట్టినట్లే అనిపించిందని డేవ్ ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతడు చిత్రించిన ఈ భూత్‌బంగ్లా వీడియో కెనడాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
దెయ్యాలంటూ.. అర్ధరాత్రి హల్చల్
హైదరాబాద్ : 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి' అంటూ అర్ధరాత్రి సమయంలో ఓ బంగ్లా వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది యువకులు సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని ఓ పురాతన భవనం వద్దకు ఫొటోలు తీసుకున్నారు. వాటిని ఫేస్బుక్, వికీపీడియా యూట్యూబ్‌ల్లో పెట్టారు. 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి. ఎవరికైనా దమ్ముంటే అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లోకి వెళ్లాలి' అంటూ సవాల్ విసురుతున్నారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా అరవడం, రాళ్లతో కొట్టడం, బాటిల్స్ విసరడం వంటివి చేస్తున్నారు. మరో ఇంట్లో ఉంటున్న ఆ ఇంటి యజమాని శారద ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడ హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మళ్లీ ఇంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని ఆ యువకులతో ప్రమాణం చేయిం చారు. కాగా, ఆ బంగ్లాలో ఎలాంటి దుష్టశక్తులు లేవని, భయాందోళనకు గురికావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు.