ఏపీలో 138 చదరపు కిలోమీటర్ల మేర కోల్పోయిన అటవీ పరిధి
అల్లూరి జిల్లాలో అత్యధికంగా 101 చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల
మరో వైపు భారీగా పెరుగుతున్న మడ అడవులు
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ తాజా నివేదిక
రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం ఏపీలో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి.
ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలవగా, ఏపీ రెండోస్థానంలోనూ, తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి. 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉన్న ఏపీ అటవీ విస్తీర్ణం 2023 నాటి లెక్కల ప్రకారం 30,084.96 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది.
మడ అడవుల్లో ఏపీ ఫస్ట్
ఒకవైపు అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండగా..మరోవైపు మడ అడవుల విస్తీర్ణం ఏపీలో భారీగా పెరుగుతున్నట్టు ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడైంది. దేశంలో 49,991.68 కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి.
దీన్లోభాగంగా ఏపీలో 2023లో 13.01 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగి మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో మహారాష్ట్ర ఉంది. కృష్ణా, బాపట్ల, కాకినాడ ప్రాంతాల్లో సహజ పునరుత్పత్తి, తోటల పెంపకం తదితర కార్యకలాపాలతో మడ అడవుల పరిరక్షణ సమర్థంగా జరిగినట్టు నివేదికలో వెల్లడైంది.
అగ్నికి ఆహుతవుతున్న అడవులు
ఏపీలోని అడవుల్లో మేలిమి జాతి వృక్షాలు, ఇతరత్రా అటవీ సంపద ఎక్కువగా అగ్నికి ఆహుతి అవుతున్నట్టు తేలింది. 2023–24లో ఏపీలో 5,286.76 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి అగ్ని ప్రమాదాలకు గురైంది.
ఇలా మంటల ధాటికి అడవులను కోల్పోయిన రాష్ట్రాల్లో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోనూ 3,983.28 కిలోమీటర్ల మేర అడవులు మంటలకు గురయ్యాయి. అత్యధిక విస్తీర్ణం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ 101.69 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం కోల్పోవడం విస్మయం కలిగించే అంశం.
ఏపీలో అడవుల విస్తీర్ణం ఇలా
మొత్తం అటవీ విస్తీర్ణం 30,084.96చ.కి.మీ
గుంటూరులో అత్యల్పంగా 13.34చ.కి.మీ
రాష్ట్రంలో దట్టమైన అడవులు 1,995.71 చ.కి.మీ
అల్లూరి జిల్లాలో అత్యధికంగా 6,917.32 చ.కి.మీ
అల్లూరి జిల్లాలో అత్యధికంగా దట్టమైన అడవులు 1,183.18 చ.కి.మీ
రాష్ట్రంలో మధ్యస్థ అడవులు 13,725.75 చ.కి.మీ
Comments
Please login to add a commentAdd a comment