
యాదాద్రి: నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్‌లోని నాగార్జునపేట తండా ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు లేచి అడవిని చుట్టుముట్టడంతో అటవీశాఖ సిబ్బంది ఆప్రాంతానికి వెళ్లి ఫైర్‌బ్లోయర్ల సహాయంతో ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో అష్టకష్టాలు పడి మంటలను అదుపులోకి తెచ్చారు.
నాగార్జునపేట ప్రాంతంలో రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే రావడంతో గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకుంది. మంటలు చెలరేగడంతో రైతులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వెళ్లి మంటలను ఆర్పారు.
Comments
Please login to add a commentAdd a comment