
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
బీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్యకళాశాల, నర్సింగ్ విద్యార్థులకు ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాచకొండ పోలీసులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు డిప్యూటీ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ.. వాహనదారులు సురక్షితమైన డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని, ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహకరించాలన్నారు. అంతకుముందు మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా, డీన్ రాహుల్‌నారంగ్, అభిషేక్ ఆరొరా, బిపిన్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment