
ఎన్నికల్లో పీఓలు, ఏపీఓలే కీలకం
టెన్త్ పరీక్షలను
పకడ్బందీగా నిర్వహించాలి
సాక్షి యాదాద్రి : మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో సమన్వయ సమావేశమై పరీక్షల నిర్వహణపై మార్గదర్శనం చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, 8,631 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రశ్న పత్రాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి బస్సులు నడపాలని, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఏసీపీ రమేష్, డీఐఈఓ, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, యాదాద్రి : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో పీఓలు, ఏపీఓల పాత్ర కీలకమని, పోలింగ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే, శాసనమండలి ఎన్నికల పోలింగ్ భిన్నంగా ఉంటుందన్నారు. ఎన్నిక బ్యాలెట్ పద్ధతిన జరుగుతుందని, ఓటింగ్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని, సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఈనెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని, పోలింగ్ సామగ్రి తీసుకున్న అనంతరం సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించాల్సిన బాధ్యత పీఓలదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment