
మహాకుంభాభిషేక ఏర్పాట్లలో తేడా రావొద్దు
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బంగారు విమానగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచ్చేస్తున్నందున ఎక్కడా తేడా రావద్దని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని, అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక సేవలను అందుబాటులో ఉంచాలని, పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్ ప్రసాద్, పోలీస్, రెవెన్యూ, డీఆర్‌డీఓ, ఎండోమెంట్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఫైర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment