Depletion Of Forests Worldwide - Sakshi
Sakshi News home page

అడవికి ఆపద.. రెండోస్థానంలో భారత్‌.. ఆందోళన పెంచుతున్న అధ్యయన వివరాలు

Mar 23 2023 4:36 AM | Updated on Mar 23 2023 9:48 AM

Depletion of forests worldwide - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అడవుల క్షీణత ప్రమాదఘంటికలు మోగిస్తుండగా.. ప్రపంచంలోనే అటవీప్రాంతం క్షీణతలో భారత్‌ రెండోస్థానంలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. 2015–2020 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అటవీప్రాంతాల క్షీణతపై ఐక్య రాజ్య సమితికి అనుబంధంగా ఉండే యుటిలిటీ బిడ్డర్‌ అనే సంస్థ నివేదిక సమర్పించింది.

ఇంధనం, యుటిలిటీ వ్యయాలు, అడవుల క్షీణత, అందులోనూ పర్వతప్రాంతాల అడవుల క్షీణతపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం తగ్గుదలలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2015–2020 మధ్య భారత్‌లో 16.50లక్షల ఎకరాల అటవీప్రాంతం కనుమరుగయ్యింది. 41.88లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కోల్పోయి బ్రెజిల్‌ మొదటిస్థానంలో ఉండగా 10.50 లక్షల ఎకరాల అటవీప్రాంతం క్షీణతతో ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. 



భారత్‌లో పరిస్థితి ఆందోళనకరం..
ఇక గత 30ఏళ్లలో అటవీప్రాంతాల క్షీణతను పరిశీలిస్తే భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక వెల్లడించింది. 1990–2000  అటవీప్రాంతాల క్షీణత రేటుతో పోలిస్తే 2015–2020లో దేశంలో అడవులు మరింత వేగంగా కనుమరుగవుతున్నాయి.

1990–2000 మధ్య అంటే పదేళ్లలో దేశంలో 9.48 లక్షల ఎకరాల అటవీప్రాంతం తగ్గింది. కానీ 2015–2020 ఐదేళ్లలోనే 16.50లక్షల ఎకరాల అటవీప్రాంతం తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 



పర్వత ప్రాంతాల అడవులు తగ్గుదల..
ప్రపంచ వ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో అడవులు వేగంగా తరిగిపోతున్నాయని నివేదిక వెల్లడించింది. 2000లో భూమి మీద పర్వతాలపై 271కోట్ల ఎకరాల అటవీప్రాంతం ఉండేది. కాగా 2018నాటికి 19.29కోట్ల ఎకరాల పర్వతప్రాంత అడవులు కనుమరుగైపోయాయి.

పర్వతప్రాంతాల అడవుల క్షీణతకు పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలే ప్రధాన కారణం. దాంతోనే 42శాతం పర్వతప్రాంతాల అడవులు క్షీణిస్తున్నాయి. కాగా కార్చిచ్చులతో 29శాతం, వ్యవసాయ విస్తరణతో 15శాతం, పోడు వ్యవసాయంతో 10శాతం పర్వత ప్రాంతాల అడవులు తగ్గాయి. 

సగానికిపైగా ఆసియా ఖండంలోనే.. 
పర్వత ప్రాంతాల అడవుల క్షీణతలో సగానికిపైగా ఆ­సి­యా ఖండంలోనే ఉండడం గమనార్హం. ఆసి­యా ఖండంలో 39.8 మిలియన్‌ హెక్టార్ల అటవీ­ప్రాం­­తం తగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement