
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు నియంత్రణ లేకుండా శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు దాదాపు 11,000 ఎకరాల విస్తీర్ణం వరకు దీని మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెప్పారు.
అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్‌ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం. దీని వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అనేక అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3,000 భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు అంచనా వేశారు.
చెలరేగుతున్న అడవి మంటలు కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు అంగీకరించలేదని.. వారు పరిస్థితిని అర్థం చేసుకుని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు చెప్పుకొచ్చారు.
చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్‌మెంట్