నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే.. | The Dancing Mangrove Trees of Sumba Island Indonesia | Sakshi
Sakshi News home page

నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..

Published Sun, Feb 4 2024 4:49 PM | Last Updated on Sun, Feb 4 2024 4:50 PM

The Dancing Mangrove Trees of Sumba Island Indonesia - Sakshi

మన ఊహకే అందని విచిత్రాలు ఈ ప్రకృతి సొంతం. ఎంతలా ఏఐ వంటి మహత్తర టెక్నాలజీల వచ్చినా కొన్ని విచిత్రాలు ఇప్పటకీ ఓ పట్టాన అర్థం కావు. ఎందువల్ల ఇలా జరిగిందనేది మేధావుల మెదడుకు అందదు. కానీ అవి ఓ మనిషి నువ్వు ఎన్ని కనిపెట్టిన మమ్మల్ని అందుకోలేవు అన్నట్లు ప్రకృతి తన వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడూ చెంపదెబ్బ కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నా అధీనుడవే అంటుంది. అహం చూపించావో అంతం చేసేస్తా అన్నట్లు కన్నెర జేస్తుంది ప్రకృతి. ఎప్పటికీ నీ శక్తికి, వైవిధ్యానికి దాసోహం అంటే అన్ని అర్థమ​య్యేలా అమ్మలా వివరిస్తుంది. 'దటీజ్‌ నేచర్‌' అని చెప్పకనే చెబుతుంది. ఈ నాటి ఆసక్తికర విశేషాలేంటో చూద్దామా!

నాట్య భంగిమల్లా కనిపించే ఈ నిలువెత్తు వృక్షాలు ఇండోనేసియాలోని సుంబా దీవి మడ అడవుల్లోనివి. ఉప్పునీరు పుష్కలంగా ఉండే చోట ఈ చెట్లు పెరుగుతాయి. 
సుంబా దీవిలోని వలాకిరి బీచ్‌లో ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించాలనుకునే ఫొటోగ్రాఫర్లు తరచుగా ఇక్కడకు వస్తుంటారు. సూర్యోదయ, సూర్యాస్తమ వేళల్లో ఈ చెట్ల ఫొటోలు తీస్తుంటారు.
మనుషులు మొట్టమొదటగా మచ్చిక చేసుకున్న జంతువులు మేకలు. మనుషులు మేకలను పదివేల ఏళ్ల కిందటే మచ్చిక చేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
కొందరికి ఎలుకలంటే చచ్చేంత భయం. ఎలుకల పట్ల ఉండే ఈ భయాన్ని వైద్య పరిభాషలో ‘మ్యూరోఫోబియా’ అంటారు. 
ఏదో మాట వరసకు గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం గాని, దాని చేత నీళ్లు తాగించలేం అంటుంటారు. అదంతా అపోహ మాత్రమే! గుర్రాలకు నీళ్లు తాగడం బాగా ఇష్టం. ఒక గుర్రం రోజుకు సగటున ముప్పయి నుంచి అరవై లీటర్ల వరకు నీటిని అవలీలగా తాగేయగలదు. 

(చదవండి: పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement