తమిళ సినిమా: ధర్మపురిలో తల్లికి దూరమై న ఓ పిల్ల ఏనుగును అటవీ శాఖ అధికారులు ఇటీవల ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్ర నటుడు బొమ్మన్‌కు అప్పగించారు. వివరాలు.. ధర్మపురి జిల్లా ఒగెనకల్ సమీపంలోని అడవిలో సంచరించే ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు పెన్నాగరం సమీపంలోని ఓ బావిలో పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న అధికారుల సహాయంతో గున్న ఏనుగును సురక్షితంగా బయటికి తీశారు.
దాన్ని తన తల్లి ఏనుగు వద్దకు చేర్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్ర నటుడు బొమ్మన్‌కు ఆ పిల్ల ఏనుగును తనకు అప్పగించవలసిందిగా అటవీ శాఖ అధికారులను కోరాడు. దీంతో అధికారులు ఆ పిల్ల ఏను గును లారీ ద్వారా ముదుమలై అడవి ప్రాంతంలోని ఏనుగుల సంరక్షణ శిబిరానికి చేర్చారు. అక్కడ ఆ పిల్ల వైద్య పరీక్షలు నిర్వహించి బొమ్మ న్‌కు అప్పగించారు కాగా ఇప్పటికే ఆయన ఆ శిబిరంలో రెండు గున్న ఏనుగులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment