సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌! |  Varun Tej accepts MP Santosh KumarGreen india challenge | Sakshi
Sakshi News home page

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

Published Sat, Oct 5 2019 3:24 PM | Last Updated on Sat, Oct 5 2019 3:34 PM

 Varun Tej accepts MP Santosh KumarGreen india challenge - Sakshi

వరుణ్‌ తేజ్‌ (గద్దలకొండ గణేష్‌ మూవీ స్టిల్‌)

సాక్షి,  హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సినీ నటుడు వరుణ్ తేజ్ కొణిదెల స్వీకరించాడు.  గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్‌ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు.  దీనికి సంబంధించిన  ఆయన శనివారం ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం బిజీగా ఉన్నా..కానీ మంచి పనికోసం కొంచెం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనని ట్వీట్‌ చేశారు. అంతేకాదు  హరా హైతో భరా హై హ్యాష్‌ ట్యాగ్‌ తో  గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను నామినేట్‌ చేశాడు. మరి  ఈ మెగా ప్రిన్స్ చాలెంజ్‌ను  ఈ సాయి పల్లవి, తమన్నా ఎపుడు స్వీకరిస్తారో వేచి  చూడాలి. 

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ, సంస్థ ప్యాట్రన్ సంతోష్ కుమార్ గతనెలలో (గురువారం, సెప్టెంబర్ 5) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement