ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసిన నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంతోష్‌కుమార్ దాదాపు ఆరువేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్ చేశాడు.
అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు బయడపడినా, ఎవరైనా సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈ నకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడం ఆధార్ బయోమెట్రిక్ భద్రతకు సవాల్‌గా నిలిచింది. కాగా, ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment