డ్రగ్స్ నేపథ్యంలో 'భాగ్యనగరం' | Kannda Dubbing Movie Bhagya Nagaram | Sakshi

Nov 26 2017 10:07 AM | Updated on Nov 26 2017 10:08 AM

Kannda Dubbing Movie Bhagya Nagaram - Sakshi - Sakshi

కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సంతోష్‌ కుమార్‌ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కన్నడ స్టార్‌ హీరో అయిన యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. షీలా హీరోయిన్‌గా నటించింది. వెర్సటైల్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రని పోషించారు. ముమైత్‌ఖాన్‌ మరో ముఖ్య పాత్రలో నటించింది.

నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ - 'డ్రగ్స్‌ వలన పెడదారి పట్టిన నలుగురు యువకుల కథే 'భాగ్యనగరం'. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువతీ, యువకులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్‌రాజ్‌, హీరో యష్‌ల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే కథ, కథనం చాలా కొత్తగా వుంటుంది. 

దర్శకుడు కె.వి.రాజు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అర్జున్‌ జన్య మ్యూజిక్‌ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌గా నిలిచింది. సినిమా చూశాక ఒక గొప్ప చిత్రం చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. భాగ్యనగరంలాంటి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అకున్‌ సబర్వాల్‌గారు ఈ సినిమా ట్రైలర్‌ చూసి చాలా అద్భుతంగా వుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలి అని అప్రిషియేట్‌ చేశారు. త్వరలో ఆయన ట్రైలర్‌ లాంచ్‌ చేయనున్నారు' అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement