ప్రేమ వేధింపులకు వివాహిత బలి | house wife gets harassment turns to suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ వేధింపులకు వివాహిత బలి

Published Sun, Mar 8 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

house wife gets harassment turns to suicide

నల్లగొండ: ప్రేమ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వల్లపుదాసు శైలజ(25)ను అదే గ్రామానికి చెందిన చెనగాని గోపి కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శైలజ భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు విధులకు వెళ్లడంతో... గోపి ఆదివారం కూడా శైలజను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

 

స్థానికులు బాధితురాలిని తొలుత సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement