సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్‌లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్‌లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది.
మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment