దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య | Uttarpradesh man shooted mother and famly later he shoots himself | Sakshi
Sakshi News home page

దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య

Published Sat, May 11 2024 11:12 AM | Last Updated on Sat, May 11 2024 11:12 AM

Uttarpradesh man shooted mother and famly later he shoots himself

ప్రపంచవ్యాప్తంగా మదర్స్‌ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన  స్థానికంగా సంచలనం రేపింది.

పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్  (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్‌ సెంటర్‌కి  పంపాలని  కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు.  

తొలుత  65 ఏళ్ల తల్లి  సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత  భార్య ప్రియాంక (40)ని సుత్తితో  కొట్టి హత్య చేశాడు.  అంతటితో ఆగలేదు  ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని  సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు

ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద  జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో  భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement