
సాక్షి, దొడ్డబళ్లాపురం (కర్ణాటక): బాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి పోలీసులు మహిళతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసారు.
నెలమంగల తాలూకా అరిశినకుంట నివాసి గిరీష్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గిరీష్ భార్య చైత్ర, ఈమె పనిచేసే లారీ షోరూం బాస్ కల్లేశ్ జైన్, ఇతడి అనుచరులు కారు డ్రైవర్ ప్రభు, గోపాలయ్య, శికుమార్, నాగరాజులను పోలీసులు అరెస్టు చేసారు. రూ.10 లక్షలు సుపారి ఇచ్చినట్లు జైన్ ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment