supari murders
-
బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
కోల్‌కతా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి పశి్చమబెంగాల్లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అజీమ్ హత్యకు అతని పాత స్నేహితుడే రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పశి్చమబెంగాల్ సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది గురువారం ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది పక్కా ప్రణాళికతో చేసి హత్య. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్ ప్రాంతంలో అజీమ్ చివరిసారిగా కనిపించిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను అజీమ్ పాత స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. అమెరికా పౌరసత్వమున్న ఆ స్నేహితుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపాక మృతదేహాన్ని ముక్కలుగా చేశారు. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
తండ్రిని చంపేశారనే కక్షతో..
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన రియల్టర్ రఘుపతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదమూడేళ్ల క్రితం తన తండ్రి జంగారెడ్డిని కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి.. రఘుపతిని అంతమొందించేందుకు రూ.30 లక్షలకు కర్ణాటకకు చెందిన కిరాయి గుండాలతో సుపారీ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం కిరాయి మూకలు ఈనెల 15న దమ్మాయిగూడలోని శివనగర్‌లో రఘుపతిపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీ కాంత్ రెడ్డి, మంజునాథ్‌లతో పాటు సుపారీ గ్యాంగ్‌లోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మల్కజ్గిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్‌లతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడ పీఎస్ రావ్ నగర్‌కు చెందిన సూరకంటి శ్రీకాంత్ రెడ్డి తండ్రి జంగారెడ్డికి కాప్రా మండలం చక్రిపురంలోని సీతారాం నగర్‌కు చెందిన హతుడు అంబటి రఘుపతి అలియాస్ రఘుకు 2009లో ప్లాట్ విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో రఘుపతి, మరికొందరు స్నేహితులతో కలిసి జంగారెడ్డిని హత్య చేశాడు. 2012లో ఈ కేసులో న్యాయస్థానం రఘుపతిని నిర్ధోషిగా తేల్చింది. అప్పట్నుంచి శ్రీకాంత్ రెడ్డి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని భావించిన శ్రీకాంత్ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జంగారెడ్డికి దగ్గరి స్నేహితుడు మంజునాథ్ సహాయం కోరాడు. జంగారెడ్డి హత్య అనంతరం మంజునాథ్ కర్నాటకలోని శిమోగా జిల్లాలో మెటీరియల్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రఘుపతిని హత్య చేసేందుకు కర్నాటకకు చెందిన కిరాయి హంతకుడు రిజ్వాన్‌తో రూ.30 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇతను తన స్నేహితులైన భావిత్, మహ్మద్ సాదీఖీ అలియాస్ రహాద్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్, సుమిత్, నేతలతో కలిసి నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి శ్రీకాంత్ రెడ్డి దమ్మాయిగూడలోని పీఎస్రావ్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఆశ్రయం కల్పించాడు. హంతకులు తిరిగేందుకు సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు. వీరు నెల రోజులుగా రఘుపతి ఇళ్లు, తదితర ప్రాంతాలను రెక్కీ చేశారు. ఈ క్రమంలో ఈనెల 15న రాత్రి రఘుపతి తన స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్‌లతో కలిసి శివనగర్‌లోని ఓ ప్లాట్ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్వీఆర్ వైన్స్ సమీపంలో నిందితులు కత్తులు, వేట కొడవళ్లతో రఘుపతిపై దాడి చేశారు. అతడి తలకు తీవ్ర గాయాలు కావటంతో రఘుపతి అక్కడికక్కడే మరణించాడు. రఘుపతి స్నేహితుడు ప్రసాద్‌కు ఎడమ భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. హత్య అనంతరం ఘటనాస్థలి నుంచి ద్విచక్ర వాహనాలపై శ్రీకాంత్ రెడ్డికి ఇంటికి వెళ్లిన నిందితులు.. అక్కడ్నుంచి రెండు కార్లలో రాష్ట్ర సరిహద్దులను దాటేశారు. హత్యకు వినియోగించిన వేట కొడవళ్లను కీసర నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్కు వెళ్లే మార్గంలో చిత్రంభళారే విచిత్రం స్టూడియో పక్కన ఉన్న పొదల్లో పారవేశారు. రూ.30 లక్షలలో కొంత మొత్తాన్ని శ్రీకాంత్ రెడ్డి రిజ్వాన్‌కు అందించగా.. నిందితులు పంచుకున్నారు. సుపారీ డబ్బుల కోసం వచ్చి చిక్కారు.. సుపారీ డబ్బుల్లో ఇంకా కొంత రావాల్సి ఉండటంతో హంతకులు సాదీఖ్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్ కర్నాటక నుంచి శ్రీకాంత్ రెడ్డికి చెందిన బొమ్మలరామారం మండలం రంఘపురంలోని ఫామ్ హౌస్‌కు వచ్చారు. అప్పటికే సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించిన జవహర్‌నగర్ పీఎస్, మల్కజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు మాటువేసి ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి, మంజునాథ్, కాప్రా మండలం సాయిబాబానగర్‌కు చెందిన కావాడీ రాజేశ్‌లతో పాటు అంతరాష్ట్ర నిందితులు ముగ్గుర్ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు వేట కొడవళ్లు, మూడు కత్తులు, కారు, బైక్‌లను స్వా«దీనం చేసుకున్నారు. రిజ్వాన్, భావిత్, సుమిత్, నేతలు పరారీలో ఉన్నారు. (చదవండి: తాగుబోతు అల్లుని కిరాతకం.. భార్యను ఇంటికి పంపలేదని) -
ఆన్లైన్లో ‘సుపారీ ఇస్తానన్న’ వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను హత్యచేస్తే రూ.కోటి ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొఘల్‌పురకు చెందిన ఖవి అబ్బాసీ ఏఐఎంఐఎం (ఇంకిలాబ్) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓ మతానికి వ్యతిరేకంగా నుపూర్ శర్మ మాట్లాడారనే ఉద్దేశంతో ఖవి సోషల్ మీడియాలో ఆయన్ను చంపితే నజరానా ఇస్తానంటూ ప్రకటించారు. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?) -
బాస్‌తో వివాహేతర సంబంధం..భర్త అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, దొడ్డబళ్లాపురం (కర్ణాటక): బాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి పోలీసులు మహిళతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసారు. నెలమంగల తాలూకా అరిశినకుంట నివాసి గిరీష్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గిరీష్ భార్య చైత్ర, ఈమె పనిచేసే లారీ షోరూం బాస్ కల్లేశ్ జైన్, ఇతడి అనుచరులు కారు డ్రైవర్ ప్రభు, గోపాలయ్య, శికుమార్, నాగరాజులను పోలీసులు అరెస్టు చేసారు. రూ.10 లక్షలు సుపారి ఇచ్చినట్లు జైన్ ఒప్పుకున్నాడు. -
హత్యల కోసం సుపారీ ఇచ్చిన రైల్వేశాఖ
అదేంటి.. రైల్వే శాఖ ఏంటి, హత్యలు చేయించడానికి సుపారీ ఇవ్వడం ఏంటనుకుంటున్నారా? చార్బాగ్ రైల్వేస్టేషన్లో ఎలుకలను చంపడానికి నెలకు రూ. 35వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదంతా ఎందుకని మొత్తం ప్లాట్‌ఫారాలను తవ్విపారేస్తున్న వందలాది ఎలుకలన్నింటినీ పట్టుకుని చంపడానికి ఓ ప్రైవేటు కంపెనీకి రూ. 4.76 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు. వీటివల్ల రైల్వే ఆస్తులకు, ఫైళ్లకు తీవ్రమైన నష్టం కలుగుతోంది. ఇంతకుముందు 2013 సంవత్సరంలో కూడా ఎలుకలను చంపడానికి ఓసారి కాంట్రాక్టు ఇచ్చినా, వాళ్లు సరిగా ఆ పని చేయలేకపోయారు. గడిచిన ఏడాది కాలంలో ప్లాట్ఫారం మీద వివిధ వస్తువులు అమ్ముకునేవారికి రూ. 10 లోల వరకు నష్టం కలిగిందని, దాంతో ఈ అమ్మకందారులే కాక.. ప్రయాణికులు కూడా ఎలుకలంటే భయపడిపోతున్నారని, చివరకు క్లోక్రూంలలో భద్రపరిచిన సామాన్లను కూడా ఈ ఎలుకలు వదలడం లేదని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు ఇన్ని ఎలుకలను చంపాలని లక్ష్యం ఏమీ పెట్టలేదని, వాళ్లు చంపిన ఎలుకలను చార్బాగ్ రైల్వేస్టేషన్ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తారని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ప్లాట్‌ఫారాల కింద ఎలుకలు ఏకంగా కాలనీలు ఏర్పాటుచేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం ఏడాది పాటు ఉండే కాంట్రాక్టులో భాగంగా కంపెనీవాళ్లు 25 సార్లు స్టేషన్‌కు వస్తారన్నారు. ఎలుకలు మొత్తం అన్ని ప్లాట్‌ఫారాలను తవ్వేశాయని, అవి ఐదో నెంబరు ప్లాట్ఫారం నుంచి లోపలకు ప్రవేశించి, రెండో నెంబరు ప్లాట్ఫారం నుంచి బయటకు వస్తాయని సూరజ్ కుమార్ అనే వ్యాపారి చెప్పారు. ఒక్కో ఎలుక బరువు అరకిలోకు పైగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే పిల్లలను కూడా కరుస్తున్నాయని బ్రిజేష్ సింగ్ అనే ప్రయాణికుడు చెప్పారు. ఎలుకలను చంపేవాళ్లు మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్రాంతాల్లోను తమ పని చేస్తారని, వాటికోసం మందు కలిపిన ఆహార పదార్థాలను సిద్ధం చేస్తారని అంటున్నారు. మొదట్లో ఎలుకలను చంపే కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నా.. రాను రాను వీటి బాధ మరీ భరించలేనిదిగా తయారు కావడంతో మొత్తం దాదాపు రూ. 5 లక్షలు వెచ్చించక తప్పడం లేదట.