
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): రెండు రోజుల క్రితం ఉరివేసుకొన్న స్థితిలో శవమైన మహిళ కేసును డెంకణీకోట పోలీసులు ఛేదించారు. భర్త, మరిదే నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని కాడుముచ్చంద్రం గ్రామానికి చెందిన కూలి కార్మికుడు మారేగౌడ (38). ఇతని భారతి(28). బుధవారం మధ్యాహ్నం ఆమె ఉరివేసుకున్న రీతిలో చనిపోయింది.
ఆమె తండ్రి బైరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. భర్త మారేగౌడు, మరిదిచూడేష్‌లు భారతిని హత్య చేసి ఉరివేసుకుందని అందరూ నమ్మేలా వేలాడదీసినట్లు విచారణలో తేలింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తేలింది.
కళ్లల్లో కారం చల్లి నగలు చోరీ
క్రిష్ణగిరి: మహిళ కళ్లల్లో కారం చల్లి నగలు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా కురుబరపల్లి సమీపంలోని సామంతమలై గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడివేలు భార్య పట్టు (45) సాయంత్రం నడుచుకుని వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి కళ్లల్లో కారంపొడి చల్లి, కత్తితో పొడిచి ఆమెపై ఉన్న నగలు దోచుకెళ్లారు. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment