నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!  | Kadaisi Vivasayi Kasammal actress beaten to death by son | Sakshi
Sakshi News home page

నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే! 

Published Thu, Feb 8 2024 12:11 PM | Last Updated on Thu, Feb 8 2024 1:35 PM

Kadaisi Vivasayi Kasammal actress beaten to death by son - Sakshi

అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ  మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే..

పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’  సినిమాతో పాపులర్‌ తమిళ నటి  కాసమ్మాళ్‌  హత్యకు గురైంది. అదీ  కని పెంచిన సొంత  కొడుకు  నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు.  నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి.

గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు  కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్‌ చేశాడు.  దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్‌లోని  కాసమ్మాళ్‌ స్వగృహంలో ఈ విషాదం చోటు  చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని  అరెస్ట్‌ చేశారు. కాసమ్మాళ్‌, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు.

కాగా కాసమ్మాళ్‌  2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది.  ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ  మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement