సీనియర్‌ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు | IAS couple daughter dies by suicide in Mumbai note says no one to be blamed | Sakshi
Sakshi News home page

సీనియర్‌ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు

Published Mon, Jun 3 2024 5:15 PM | Last Updated on Mon, Jun 3 2024 5:39 PM

IAS couple daughter dies by suicide in Mumbai note says no one to be blamed

భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె.  చదువులో  కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది.  ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.


పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్‌రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి  లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది.  ఈమె హర్యానాలోని సోనేపట్‌లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి  నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. 

ముంబైలోని అపార్ట్‌మెంట్‌లోని 10వ అంతస్తు నుంచి  దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ  అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్‌ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు మిలింద్‌, మనీషా మహీస్కర్‌  జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement