ఘటనాస్థలంలోనే కుప్పకూలిన షింజో.. పక్కన దుండగుడు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యోదంతం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. సమర్థవంతమైన నేతగా, అజాత శత్రువుగా పేరున్న షింజోపై దాడి జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో జపాన్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కీలక విషయాలని వెల్లడించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది.
గతంలో జపాన్ సైన్యంలో మూడేళ్లపాటు (2002-2005) పని చేసిన టెత్సుయా యమగామి(41).. షింజో అబే మీద కాల్పులకు తెగబడ్డాడు. జపాన్ పశ్చిమ నగరం నారాలో ఓ ట్రైన్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో(అక్కడి కాలమానం ప్రకారం) పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు షింజో అబే.
ఆ సమయంలో వెనుక నుంచి షింజోపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు టెత్సుయ యమగామి. మొదటి బుల్లెట్‌కు వెనక్కి వంగిపోయిన షింజో.. రెండో బుల్లెట్ తగలగానే కుప్పకూలిపోయారు ఆ వెంటనే దుండగుడు టెత్సుయాను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇక పోలీసుల ఎదుట యమగామి నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
#ShinzoAbe #安倍さん
— manj.eth (@ManjTrader) July 8, 2022
Sad news
Offender, 41-year-old Japanese national Tetsue Yamagami, served in the Navy.
With a homemade double-barreled gun, 2 shots, hit the lung and die. pic.twitter.com/dm4ElkceCg
‘‘షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ, అసంతృప్తితో రగిలిపోతున్నానని,అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆయనకు చికిత్స అందుతుండడంతో తాను నిరుత్సాహానికి లోనయ్యాను’’ అంటూ విచారణలో పోలీసుల ఎదుట సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన తుపాకీని అతనే స్వయంగా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టెత్సుయాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు లభించినట్లు సమాచారం. అయితే అతని సమాధానాల్లో నిజానిజాలు ఎంతున్నాయో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.
షింజో అబేపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని ఫుమియో కిషిదా.. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన అచేతనావస్థలోకి వెళ్లిపోయారని సిబ్బంది ప్రకటించారు. ఈలోపు ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ఫలించకపోగా.. కాసేపటికే ఆయన కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గుండెలోకి తూటా దూసుకెళ్లినందుకే ఆయన చనిపోయినట్లు నారా మెడికల్ యూనివర్సిటీ వైద్యులు నిర్ధారించారు.
Abe Shooting and Arrest of Shooter pic.twitter.com/iFV6V67YXx
— SubX.News (@NewsSubstance) July 8, 2022
Comments
Please login to add a commentAdd a comment