
సాక్షి, చెన్నై : చెంగల్పట్టులో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. చెంగల్పట్టు పోలీసుస్టేషన్, పాత బస్టాండ్ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో అటువైపు వచ్చిన మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు జనం చూస్తుండగానే నరికి చంపేశారు. ( చదవండి: వివాహితతో యువకుడి చాటింగ్.. చివరికి ఇద్దరూ కూడా.. )
అక్కడి నుంచి పరుగులు తీసిన ఆ వ్యక్తులు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడి, అక్కడ ఉన్న ఓ వ్యక్తిని హతమార్చి పరారయ్యారు. జనం కళ్ల ముందే ఈ హత్యలు జరగడం కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు గురైన వారు అప్పు అలియాస్ కార్తికేయన్, అలగేశన్‌గా గుర్తించారు. వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment