
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): మరొకరితో సన్నిహితంగా ఉంటోందని కుటుంబసభ్యులు గొంతు కోసి మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మద్నూర్‌లో గోసం లక్ష్మికి గతంలోనే వివాహం జరుగగా భర్త వదిలివేశాడు. దీంతో లక్ష్మి తన కొడుకు రవి, తమ్ముడు ప్రవీణ్‌లతో కలిసి మండలకేంద్రంలో నివసిస్తోంది. ఈక్రమంలో లక్ష్మి మరొకరితో సన్నిహితంగా ఉండటం కొడుకు, తమ్ముడు జీర్ణించుకోలేకపోయారు.
మంగళవారం తెల్లవారుజామున వారు నిద్రపోతున్న లక్ష్మిపై కత్తితో దాడిచేసి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగు, పొరుగు వాళ్లు ఇంట్లోకి వచ్చారు. వెంటనే నిందితులు పారిపోయారు, బాధితురాలిని నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి కూతురు శీరిష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment