తాంసి(ఆదిలాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘోరం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన పాండురంగ, ఆశాబాయి(40) దంపతులకు దత్తు(12), లక్ష్మి (10) అనే పిల్లలున్నారు.
కొంతకాలంగా మద్యానికి బానిసైన పాండురంగ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆశాబాయి.. మంగళవారం రాత్రి సమీపంలోని బావి వద్దకు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. ముందుగా వారిని బావిలోకి తోసేసి, తానూ దూకింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ కలహాలతో ముగ్గురు బలవన్మరణం
Published Wed, Aug 26 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement